హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: త్వరలో ‘వర్క్ ఫ్రం పార్క్’...

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్:  త్వరలో ‘వర్క్ ఫ్రం పార్క్’...
  • పార్కుల్లో వర్క్​ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం
  • తొలి విడతలో 30 పార్కుల్లో సౌకర్యాలు కల్పిస్తాం
  • ఎస్టీపీలు లేకుంటే గేటెడ్ కమ్యూనిటీలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వం
  • మీడియా చిట్​చాట్​లో సీఎంసీ కమిషనర్​ సృజన

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ ​మున్సిపల్​కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలోని ఐటీ ఉద్యోగులు, యువత పార్కుల్లో వర్క్ చేసుకునేలా వర్క్ ఫ్రం పార్క్​అనే కొత్త కాన్సెప్ట్​ను తీసుకురానున్నాయి. ఇందుకు అనుగుణంగా పార్కుల్లో ఫెసిలిటీస్ కల్పిస్తామని సీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. శనివారం సీఎంసీ ఆఫీస్​లో ఆమె మీడియా చిట్ చాట్ నిర్వహించారు. 

వర్క్ ఫ్రం పార్క్​తొలి విడతలో 30 పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని, పైలట్ ప్రాజెక్టు కింద కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, శేరిలింగంపల్లిలోని మాధవహిల్స్ పార్కుల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వైఫై సౌకర్యంతోపాటు ఉద్యోగులు, యువత ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూర్చొని పనిచేసుకునేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టాయిలెట్లు, సీసీ కెమెరాలు, కాఫెటేరియాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

ఎంట్రీ చార్జీలు రూ.50 నుంచి రూ.100 

‘వర్క్​ఫ్రం పార్క్’ నిర్వహణకు నామినల్ గా రూ.50 నుంచి రూ.100 వరకు  ఎంట్రీ చార్జీలు తీసుకుంటామని పేర్కొన్నారు. 3 నెలల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మరో 300 పార్కులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇప్పటికే ఉన్న 92 పార్కులకు మరమ్మతులు చేపట్టనున్నట్లు  వెల్లడించారు. సీఎంసీలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 26 నుంచి 28 వరకు మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీ-హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘సైబరాబాద్ మూవ్స్–2026’ నిర్వహించనున్నట్లు  పేర్కొన్నారు. 

ఇందులో భాగంగా ఐకియా, మైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పేస్, రహేజా, కేబుల్ బ్రిడ్జి, శిల్పారామం ప్రాంతాల్లో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ట్రాఫిక్ విధానంపై అధ్యయనం చేసి, ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి విదేశాల ప్రతినిధులు వస్తున్నారని, లండన్ మాదిరిగా మెట్రో వాడిన ఉద్యోగులకు డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. లండన్ చీఫ్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ తో చర్చించి, సలహాలు తీసుకుంటామన్నారు. అలాగే, సీఎంసీలో చేసిన పనుల వివరాలతో బోర్డులు ఏర్పాటు చేసి, క్యూర్ కోడ్ తీసుకొస్తామని పేర్కొన్నారు. 

నిర్మాణాలకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వాటరే వాడాలి 

సీఎంసీలో నిర్మాణ పనులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వాటరే(శుద్ధి చేసిన నీరు) వాడాలని కమిషనర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బోరు నీటిని వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీలు) ఏర్పాటు చేయాలని, ఎస్టీపీలు లేని కమ్యూనిటీలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేయబోమన్నారు.  

సుమారు 1,100 అక్రమ నిర్మాణాలపై చర్యలు ఇప్పటివరకు సుమారు 1,100 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్​వెల్లడించారు. అయ్యప్ప సోసైటీలో ఇప్పుడే నిర్మాణాలు రాలేదని, ఏళ్లుగా జరుగుతున్నాయన్నారు. తమ దృష్టికి ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

కొబ్బరి వ్యర్థాల ప్రాసెసింగ్..

కోకోనట్ ల్యాండ్ ఫిల్ డైవర్షన్ ప్రోగ్రాంలో భాగంగా కొబ్బరి వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్​చేసి రోడ్లు, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణంలో ఉపయోగించనున్నట్లు కమిషనర్​తెలిపారు. ఇంట్లో తడి చెత్తను ప్రాసెస్ చేసే వారిని ప్రోత్సహించేందుకు ప్రాసెసింగ్​పాట్స్​ఇస్తామని చెప్పారు.  

14న పిల్లలతో ప్రత్యేక సమావేశం 

చైల్డ్ ఫ్రెండ్లీ సిటీలో భాగంగా ఈ నెల 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. పిల్లలకు అవసరమైన సదుపాయాలు, సమస్యలు, అభిప్రాయాలను నేరుగా వారి నుంచే తెలుసుకునేందుకు ఈ మీటింగ్​ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.