గోదావరి ఎత్తిపోతలపై హరీశ్‌‌‌‌‌‌‌‌ వి పచ్చి అబద్ధాలు..బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండితే ప్రభుత్వాన్ని తిడుతున్నడు: ఆది శ్రీనివాస్

గోదావరి ఎత్తిపోతలపై హరీశ్‌‌‌‌‌‌‌‌ వి పచ్చి అబద్ధాలు..బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండితే ప్రభుత్వాన్ని తిడుతున్నడు: ఆది శ్రీనివాస్
  •     దేవాదుల దగ్గర మీ కంటే మేమే ఎక్కువ నీళ్లను ఎత్తిపోశామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే హరీశ్ రావు అబద్ధాల రావుగా మారిపోయారని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బోర్లలో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను వెతుక్కొని అక్కడికి వెళ్లి ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. కరెంట్‌‌‌‌‌‌‌‌ కొరతల వల్ల కాదు.. బోర్లలో నీళ్లు లేకపోవడం వల్లే పంటలు ఎండిపోయాయని రైతులే ఒప్పుకుంటున్నారని, అయినా హరీశ్ పచ్చి అబద్ధాలు చెబుతూ రైతులను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలేస్తున్నారని హరీశ్‌‌‌‌‌‌‌‌ నీచ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం వల్ల వర్షాలు లేక రైతులు అల్లాడుతుంటే వాళ్ల కన్నీళ్లపై హరీశ్ లాంటి వాళ్లు రాజకీయం చేస్తున్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌‌‌‌‌‌‌‌కు ఏ మాత్రం మనస్సాక్షి ఉన్నా... నిజం మాట్లాడాలి’’అని ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

బుర్ర లేకుండా మాట్లాడుతుండు..

‘‘కాళేశ్వరం దగ్గర దిగువకు పోతున్న నీళ్లను దేవాదుల, సీతారామ సాగర్ దగ్గర ఎత్తిపోయడం లేదా? ఆయన కళ్లకు ఆ నీళ్లు కనిపించడం లేదా? దేవాదుల దగ్గర 16 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతున్నారు. దేవాదులలో మొత్తం 10 పంపింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రతి రోజు 10 పంపులు నిరంతరాయంగా పనిచేస్తే 0.23 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఒక టీఎంసీ నీళ్లను ఎత్తిపోయడానికి నాలుగున్నర రోజులు పడుతుంది. కానీ హరీశ్ మాత్రం బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు” అని ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 

గత ప్రభుత్వ హయాంలో 2014–15 నుంచి 2022–23 వరకు తొమ్మిదేండ్లలో దేవాదుల నుంచి మొత్తం 86.127 టీఎంసీలు ఎత్తి పోశారని తెలిపారు. ఏడాదికి సగటు 9.57 టీఎంసీలు మాత్రమేనన్నారు. తమ ప్రభుత్వం ఈ మూడేండ్లలో 68 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశామని చెప్పారు. 2024–25లో 18.067 టీఎంసీలు, 2025–26లో 18.20 టీఎంసీలు ఎత్తి పోశామన్నారు. సగటున 18.13 టీఎంసీలు అని, గత ప్రభుత్వ సగటుతో పోలిస్తే 89 శాతం అధికమని తెలిపారు. ఈ ఏడాదిలో మొదటి ఐదు నెలల్లోనే 16.71 టీఎంసీలు, సీతారామ సాగర్ ద్వారా 8.10 టీఎంసీలు మొత్తంగా కాళేశ్వరం దిగువన ఇప్పటి వరకు మొత్తం 24.81 టీఎంసీలను ఎత్తిపోశామని వెల్లడించారు. ఇప్పుడు దుమ్ముగూడెం దగ్గర ఇసుక బస్తాలు వేసి నీటిని నిలిపి, తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నామని, బీఆర్ఎస్ నేతలు అక్కడకు వెళ్లి చూడాలని ఆయన సూచించారు.