- నేడు కొడంగల్లో పంపిణీ ప్రారంభించనున్న సీఎం
- ఈ నెల నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుపేదలు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో అర్హత కలిగిన 4.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను మంజూరు చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదివారం తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్కతోపాటు ఇతర మంత్రులు ఈ వేడుకలో పాల్గొంటారు. సీఎం చేతుల మీదుగా కొడంగల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనుండగా.. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ జరగనుంది. కొత్తగా ఎంపికైన వారందరికీ ఈ నెల నుంచే పింఛన్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షలకు చేరిన పింఛన్లు
గత సర్కారు హయాంలో ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన, సెర్ప్ ప్రత్యేక డ్రైవ్ల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు రాగా.. అర్హుల ఎంపిక కోసం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన, వార్డు, గ్రామ సభలు, ఆధార్ సీడింగ్ చేశారు. మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా (55 శాతానికి పైగా) వితంతువుల నుంచే రావడం గమనార్హం. వితంతువుల నుంచి 3,31,236, దివ్యాంగుల నుంచి 1,48,882, ఒంటరి మహిళల నుంచి 62,689, గీత కార్మికుల నుంచి 37,381, చేనేత కార్మికుల నుంచి 18,005 దరఖాస్తులు అందాయి. వీటిలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన 4.5 లక్షల మందిని తొలి విడత పింఛన్ల కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద 40.44 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. తాజాగా మంజూరైన 4.5 లక్షల కొత్త పింఛన్లను కలిపితే రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 45 లక్షలకు చేరనుంది.
గడ్డం పెంచితే రేవంత్ రెడ్డివి అయితవా?
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి అయితదా.. రేవంత్ రెడ్డికి గడ్డం ఉందని నీకు ఎవడో చెప్తే.. గడ్డం పెంచుకుంటే రేవంత్ రెడ్డివి అయితవా.. పది జన్మలు ఎత్తినా.. తలకిందికి, కాళ్లు మీదికి చేసినా.. తాటి చెట్టుకు ఉరేసుకున్నా.. నువ్వు తారక రామారావ్ వే గానీ రేవంత్ రెడ్డివి ఎన్నటికీ కాలేవు. రేవంత్ రెడ్డివి కావాలంటే కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకోవాలె. కొడంగల్లో రేవంత్ రెడ్డి
