పాతబస్తీలో పేలిన మినీ గ్యాస్ సిలిండర్

పాతబస్తీలో  పేలిన మినీ గ్యాస్ సిలిండర్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మినీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బన్, మోచీ కాలనీలో ఓ ఇంట్లో 5 కేజీల మినీ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.

ఇంట్లో మినీ సిలిండర్ పేలడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన తీరుపై వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసులు సహాయంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.