పాన్ ఇండియా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ'. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక ఈ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో ఒకటైన 'సుప్రీమ్ యాస్కిన్'గా విశ్వనటుడు కమల్ హాసన్ కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
ఈ రోజు ( నవంబర్ 7, 2026 ) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా 'కల్కి' చిత్రబృందం ఆయనకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ఆయన ఉన్న ఓ బీటీఎస్ ఫొటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, "సినిమాకు తిరుగులేని శక్తి, తరతరాలకు స్ఫూర్తి, నిజమైన లెజెండ్ అయిన ఉలగనాయగన్ కమల్ హాసన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కల్కి మరో అద్భుతమైన అధ్యాయంలో మిమ్మల్ని మళ్లీ చూడటానికి ఎదురుచూస్తున్నాం" అంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
మొదటి భాగంలో కమల్ హాసన్ పాత్రకు పరిమితమైన స్క్రీన్ టైమ్ మాత్రమే ఉన్నప్పటికీ, ఆయన కనిపించిన తీరు, భయంకరమైన యాస్కిన్ అవతారం ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా రెండో భాగంలో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య పోరు ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు అసలు ఆసక్తికరమైన అంశం. సీక్వెల్‌లో యాస్కిన్ పాత్ర మరింత కీలకంగా ఉండనుందనే అంచనాలు అభిమానుల్లో భారీగా ఉన్నాయి.
To the SUPREME force of Cinema, an inspiration to generations and a true legend. Here’s wishing the one and only Ulaganayagan, our dearest @ikamalhaasan sir a very happy birthday! We can’t wait to have you back for another epic chapter of #Kalki2898AD. https://t.co/QsnvfOp6wC
— Kalki 2898 AD (@Kalki2898AD) November 7, 2026
మరో వైపు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలిపారు. కళతో పాటు రాజకీయాల్లోనూ కమల్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఇక కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా తండ్రికి భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా 'సండియర్'పోస్టర్‌ను విడుదల చేసింది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
Happy birthday, my dear friend @ikamalhaasan 💐 It was such a joy to catch up with you recently after so long. We chatted away just like old times! After all these years, you still have a child’s curiosity and a hunger to learn. I see all 24 crafts of cinema come alive in you. May the year ahead bring you good health, happiness and the joy of discovering something new every day. With love, Chiranjeevi
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 7, 2026
