సాగర్ సీవరేజ్ లైన్ ఆధునికీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్..రూ.74.43 కోట్ల పనులకు ఆమోదం

సాగర్ సీవరేజ్ లైన్ ఆధునికీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్..రూ.74.43 కోట్ల పనులకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని హుస్సేన్‌‌ సాగర్ పరిసర ప్రాంతాల్లో సీవరేజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాగర్ లేక్ వద్ద ఉన్న 20 ఎంఎల్‌‌డీ సామర్థ్యం గల ఎస్‌‌టీపీ నుంచి దివ్యశక్తి అపార్ట్‌‌మెంట్ వరకు ఉన్న ప్రధాన ట్రంక్ సీవర్ లైన్ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

రూ.74.43 కోట్లతో చేపట్టే టెండర్‌‌ పనులను మెసర్స్ అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ శనివారం మున్సిపల్ శాఖ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ జీవో జారీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొదట రూ.91 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, టెండర్ ప్రక్రియలో అత్యల్ప ధర కోట్ చేసి, షెడ్యూల్ రేట్ల కంటే 3.78 శాతం తక్కువకు బిడ్ దాఖలు చేసిన సదరు సంస్థకు ఈ పనులు దక్కాయి.