హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసం ఈ ఏడాది ( 2026) నవంబర్ 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కార్తీకమాసం ప్రారంభమైన రెండు రోజులకే అంటే నవంబర్ 12 వ తేది కుజుడు సింహరాశిలోకి రాత్రి 08:11 గంటల నుంచి 08:30 గంటల మధ్య ప్రవేశించడంతో ఆరు (వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభ) రాశుల వారికి మహాయోగం పట్టబోతోంది. ఈ కాలంలో ఆరు రాశుల వారు ఊహించని ప్రయోజనాలను పొందుతార. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఇప్పుడు వాటి వివరాలు తెలుసుకుందాం. . .
వృషభరాశి :సింహరాశిలో కుజుడు సంచారం వలన ఈ రాశి వారు ఈ కాలంలో టీమ్ లీడర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. . విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కాపాడుకునేందుకు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా సానుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు చేకూరుతాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.
కర్కాటకరాశి : కుజుడు సింహరాశిలో సంచరించడం వలన ఈ రాశికి అన్ని అనుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కుజుడు సంకల్ప శక్తిని పెంచడం వలన ...ఏపని చేపట్టినా విజయం సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు సునాయాశంగా పూర్తవుతాయి. ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టేందుకు అనుకూల సమయం. ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సానుకూలంగా సాగిపోతుంది. ఎలాంటి ఆందోళన పడకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచేస్తున్నశుభవార్త వింటారు. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహరాశి: ఇదే రాశిలో కుజుడు సంచారం వలన ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అలాగే కొంతమంది స్నేహితులతో కలిసి ఈ సమయంలో మంచి పనులు ప్రారంభిస్తారు. దీనివల్ల శుభవార్తలు కూడా వింటారు. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలొస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తులారాశి : కుజుడు సింహరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అయితే ఆహార విషయంలో నియమాలు పాటించడం అవసరమని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు.. బంధువులు మోసగించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి.
వృశ్చిక రాశి : సింహరాశిలో కుజ సంచారంతో ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు.కష్టపడి పూర్తి ప్రయోజనం పొందుతారు.ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.గౌరవం పెరుగుతుంది. ఓర్పు, ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా కొనసాగుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి.
కుంభరాశి: ఈ రాశి వారికి కుజుడు .. సింహ రాశిలో సంచరించడం వలన చాలా ప్రయోజనాలుంటాయి. ప్రతి పనిలోనే విజయం సాధిస్తారు. మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపారంలో అమితంగా లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. సంతోషంగా ఉండేందుకు డబ్బును ఎంతైనా ఖర్చుచేయడానికి సిద్ధపడతారు. జీవిత భాగస్వామితోపాటు కుటుంబంలోని ఇతర సభ్యులతో కూడా సంబంధాలు బాగుంటాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
