స్క్రీన్ టైమ్ పెరుగుతోంది.. కంటి చూపు తగ్గుతోంది.. కళ్లను కాపాడుకోవడం ఎలా..?

స్క్రీన్ టైమ్ పెరుగుతోంది.. కంటి చూపు తగ్గుతోంది.. కళ్లను కాపాడుకోవడం ఎలా..?

స్క్రీన్ చూడకుండా ఒక రోజు ఉండగలరా.. రోజు కాదు గంట.. కాదు కాదు నిమిషం కూడా ఉండలేని పరిస్థితి కదా. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఫోన్ చూడకుండా గడిచే పరిస్థితి లేదు. దీనికి తోడు స్క్రీన్ తో చేసే వర్క్ లే ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లపైనే డ్యూటీ చేయడం.. ఇంట్లో టీవీలు, ఫోన్లు.. అప్పుడప్పుడు థియేటర్లు.. ఏదైతేనేం.. కళ్లు ఈ ప్రకృతిని చూసే కంటే స్క్రీన్ చూడటానికి ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు చిన్నల నుంచి పెద్దల వరకు కంటి సమస్యలే ఎక్కువ అవుతున్నాయి. 
 
సర్వేంద్రియనాం నయనం ప్రధానం అంటారు. కానీ ఇప్పటి బిజీ షెడ్యూల్ లో కళ్లకే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సెల్ ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్లను ఎక్కువగా చూస్తుండటం వల్ల కళ్లు తొందరగా అలిసిపోతున్నాయి. మనిషికి ఉన్న సర్వేంద్రియాలలో ముఖ్యమైన కళ్లను కాపాడుకునే మార్గాలేంటో తెలుసుకుందాం.

  • సెల్ ఫోన్ చూస్తున్నా.. కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్నా.. ఆ ప్లేస్లో తగినంత వెలుతురు ఉండేటట్టు చూసుకోవాలి.
  •  కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల కళ్లు టైర్డ్ కాకుండా ఉంటాయి.
  •  ఎక్సర్సైజ్ కళ్లకు కూడా అవసరమే. అందుకే టైం దొరికినప్పుడల్లా కళ్లను మూస్తూ, తెరుస్తూ ఉండాలి. దగ్గర వస్తువు లను, దూరం వస్తువులను మార్చి మార్చి చూస్తుండాలి.
  •  కళ్లు నొప్పిగా ఉన్నా.. అలసిపోయినట్టు అనిపించినా వెంటనే రిలాక్స్ అవ్వాలి. కళ్లపై తడిపిన దూది పెట్టి రెస్ట్ తీసుకోవాలి.
  •  కళ్లు యాక్టివ్ గా ఉండాలంటే కచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం.
  • ఎండలోకి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ వాడటం అలవాటు చేసుకోవాలి.
  • అవసరానికి మించి సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం తగ్గించే ప్రయత్నం చేయాలి.