బుద్ధా బౌల్ అంటే ఏంటి : ఇందులో ఏముంటయ్.. దీని వల్ల లాభమేంటి..?

బుద్ధా బౌల్ అంటే ఏంటి : ఇందులో ఏముంటయ్.. దీని వల్ల లాభమేంటి..?

లైఫ్ స్టైల్ మారే కొలది.. జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. డైట్ విషయంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. బిజీ బిజీ జీవితాల్లో బ్యాలెన్స్డ్ డైట్ లేకుంటే ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో.. చాలా మంది డైట్ పైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అయితే  నిన్న మొన్నటి వరకు వీగన్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ డైట్లతో బిజీగా ఉన్నవాళ్లందరూ ఇప్పుడు బుద్ధా బౌల్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ బౌల్ స్పెషల్  ఏంటో తెలుసుకుందాం.  

బుద్దా బౌల్.. ఈ డైట్ కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. పూర్వం గౌతమ బుద్ధుడు ఉదయాన్నే లేచి ఓ గిన్నె చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగేవాడట. బుద్ధుడి గిన్నెలో కొందరు అన్నం, మరికొందరు కూరగాయలు, ఇంకొందరు చిరుధాన్యాలు వేసేవాళ్లట. వాటిని కొంచెం కొంచెం తినేవాడట బుద్ధుడు. రానురాను బుద్ధుడి ఆ ఈటింగ్ హ్యాబిటే గ్రెయిన్ బౌల్ డైట్ గా మారింది. రీసెంట్ గా ఫేమస్ ఫుడ్ ఆథర్ మార్తా స్టీవర్ట్ ఆ డైట్ కే బుద్ధా బౌల్ పేరు పెట్టారు.

ఎలా తయారు చేయాలి
 
బుద్దా బౌల్ డైట్ ప్రిపరేషన్లో ముందుగా బ్రౌన్ రైసిని ఉడికించాలి. బ్రౌన్ రైస్ వద్దనుకుం టే చిరుధాన్యాలు లేదా క్వినోవా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేసి మిరియాలు, బచ్చలి కూర, తరిగిన వెల్లుల్లి, ఉప్పు వేసి పెద్ద మంటపై కాసేపు వేగించాలి.

మరొక పాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పోసి పన్నీర్, సోయా బీన్ మిల్క్ తో తయారుచేసిన పన్నీర్(తోపు) వేసి పెద్ద మంటపై ఉడికించాలి. కావాలంటే కిడ్నీ బీన్స్ ని కూడా యాడ్ చేసుకో వచ్చు.
తర్వాత టొమాటో, క్యారెట్, మష్రూమ్, క్యాలీఫ్లవర్, అవకాడో లాంటి వెజిటబుల్స్ ని కలపాలి.

ఇప్పుడు శెనగలు, నట్స్ తో   పాటు స్వీట్ చిల్లీ సాస్ కూడా వేయాలి. పైనుంచి కొన్ని సన్ ఫ్లవర్ సీడ్స్ లేదా అవిసె గింజల్ని  చల్లుకోవాలి. చక్రాలుగా తరిగిన నిమ్మకాయ ముక్కల్ని కూడా పైన ఉంచాలి. అంతే బుద్ధా బౌల్ తినడానికి రెడీ..

లాభాలేంటి
 
ఇది బ్యాలెన్స్డ్  డైట్. అన్ని రకాల పోషకాలు ఈ డైట్ లో ఉంటాయి. దాంతో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, మినరల్స్ మోతాదులో అందుతాయి.ఈ డైట్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఈ ఫుడ్ వల్ల దూరమవుతుందనేది కొంతమంది అభిప్రాయం.