డబ్బులు ఎక్కువ అయ్యి.. ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలాంటి ఆలోచనలే వస్తాయనుకుంటా.. లేకపోతే ఏంటండీ.. ఈ వార్త చదివిన తర్వాత నెటిజన్లు ఇలాగే స్పందిస్తున్నారు. ఆ పిల్లోడు చదువుతున్నది 9వ తరగతి.. ఇటీవలే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాశాడు.. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయంట.. ఈ విషయం తెలిసి ఆ తండ్రి గంతులేశాడు.. ఏదో ఐఏఎస్, ఐపీఎస్ కొట్టినట్లు.. ఐఐటీ ర్యాంక్ సాధించినంత సంబర పడ్డాడు ఆ తండ్రి.. 9వ తరగతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించిన కొడుకిని.. ఏం కావాలో కోరుకో అని అడిగాడు ఆ తండ్రి.. ఆ పిల్లోడు నాకు BMW M4 మోడల్ కారు కావాలని ముచ్చటగా అడిగాడు.. అంతే ఆ తండ్రి కోట్లు కుమ్మరించి తెచ్చి ఇచ్చాడు.. ఇంతకీ ఆ పిల్లోడి వయస్సు 15 ఏళ్లు మాత్రమే.. డ్రైవింగ్ లెసెన్స్ అర్హత కూడా లేదు..
పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్ జిల్లా గల్సి ప్రాంతానికి చెందిన బిజినెస్ మ్యా న్ తన 15 ఏళ్ల కుమారుడికి సుమారు 2 కోట్ల 30 లక్షల విలువైన బిఎండబ్ల్యు ఎం4 కాంపిటిషన్ కారును బహుమతిగా ఇచ్చి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు.
గల్సి పరాజ్ గ్రామానికి చెందిన వ్యాపారి షంసుద్దీన్ మిద్యా తన కుమారుడు మహమ్మద్ తల్హా 9వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు ఈ ప్రీమియం స్పోర్ట్స్ కారును కొనిపెట్టారు. తల్హా చాలా కాలంగా బిఎండబ్ల్యు ఎం4 కాంపిటిషన్ కావాలని తండ్రిని అడుగుతున్నాడంట. పరీక్షల్లో మంచి ఫలితం సాధించిన తర్వాత తండ్రి ఆ కోరికను తీర్చాడంట.
షంసుద్దీన్ కొడుకు కోసం ప్రత్యేకంగా ముంబై వెళ్లి అంధేరి లోని ఓ షోరూమ్ నుంచి ఈ కారును కొనుగోలు చేశారు. ఈ కారును తన గ్రామానికి ప్రత్యేక కంటైనర్‌లో తీసుకురావడం స్పెషల్ అట్రాక్షన్. ఈ కారు ధర సుమారు 2.30 కోట్లు. ట్యాక్స్, ట్రాన్స్ పోర్ట్ అంతా కలిపి 3 కోట్ల రూపాయలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
లైసెన్స్ కూడా లేదు.. కారు ఏం చేసుకుంటాడు.
ఆ కుర్రోడి వయసు15 ఏళ్లు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కు కూడా అర్హత లేదు. అయితే తాను నడపకపోయినా.. తన తండ్రి నడిపిస్తుంటే ఆనందిస్తానని తల్హా చెప్పాడు. తన దృష్టి అంతా చదువుపైనే అని చెప్పినట్లు తెలుస్తోంది.
ALSO READ : జనవరి 1 నుంచి ఇక పాత చెక్‌బుక్‌లు పనిచేయవా ? క్లారిటీ ఇచ్చిన RBI !
సోషల్ మీడియాలో దుమారం..
పదిహేనేళ్ల పిల్లోడు ఏంటి.. మూడు కోట్ల కారేంటి..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 9వ తరగతి పాసైతేనే ఇంత కాస్ట్ లీ కారు కొంటే.. టెన్త్ పాసయితే ఇక విమానం కొనిపిస్తారా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని కొందరు మెచ్చుకుంటుంటే..డ మరికొందరు ఇంత ఖరీదైన కారును పిల్లలకు ఇవ్వడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి కారు చేతిలో పెడితే.. వాడు రోడ్డు మీదకు వచ్చి బాధ్యత లేకుండా ఎన్ని యాక్సిడెంట్లు చేస్తాడో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి అంటూ కామెల్స్ చేస్తున్నారు.
గతంలో ముంబైలో లైట్‌మ్యాన్‌గా పనిచేసిన షంసుద్దీన్ , తర్వాత వరి వ్యాపారంలో ఎదిగి.. కోట్లు సంపాదించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే తన పోర్ట్ ఫోలియోలో అనేక లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తోంది.
