10 ఏళ్ల బాలుడి కడుపులోకి దూసుకెళ్లిన దీపావళి రాకెట్ : ఇంత ఘోరం వినటానికి భయంగా ఉందే..!

10 ఏళ్ల బాలుడి కడుపులోకి దూసుకెళ్లిన దీపావళి రాకెట్ : ఇంత ఘోరం వినటానికి భయంగా ఉందే..!

చిన్న పల్లోడు.. ఎంతో ఆనందంగా దీపావళి టపాసులు కాల్చటానికి రెడీ అయ్యాడు. పదేళ్ల వయస్సు.. ఎంత ఉత్సాహంగా ఉంటాడు చెప్పండి.. పిల్లోడికి దీపావళి సరదా తీర్చాలనే ఉద్దేశంతో.. ఆనందంగా టపాకులు కొనిపెట్టారు తల్లిదండ్రులు. దీపావళి సాయంత్రం రానే వచ్చింది. ఆ పదేళ్ల పిల్లోడు తారాజువ్వు.. రాకెట్ కాల్చాలని ముచ్చట పడ్డాడు. ఇది అత్యంత తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ ఘటన తలచుకుంటేనే భయంగా అనిపిస్తోంది.. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలుడు రాకెట్ ను  వెలిగించగా, అది పైకి ఎగరకుండా అతని కడుపులోకి దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందడంపై ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ పేరెంట్స్ ది. 

దీపావళి రోజు (2026 నవంబర్ 8న) ఆదివారం రాత్రి నరేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం, దీపావళి పూజ పూర్తయిన తర్వాత పటాసులు కాలుస్తుండగా బాలుడు రాకెట్‌ను వెలిగించాడు. అది ఆకాశంలోకి వెళ్లకుండా అతని కడుపు భాగంలో ఢీకొని పేలింది.  

గాయపడిన బాలుడిని వెంటనే నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే కాసేపు చికిత్స చేసిన వైద్యులు బాలుడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఏ రకమైన పటాసు పేలింది, ఎలా జరిగిందనే విషయాలను పరిశీలిస్తున్నారు.