ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ అయిన ఎన్ విడియా సీఈఓ, కో-ఫౌండర్ జెన్సెన్ హువాంగ్ వివాహేతర బంధానికి సంబంధించిన ఆరోపణలు సంచలనంగా మారాయి. చైనీస్ స్పై ఏజెంట్ తో ఎఫైర్ నిజమేనని సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. చైనీస్ గూఢచారితో ఎఫైర్ అంశం కంపెనీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై కంపెనీ స్వతంత్ర విచారణకు ఆదేశించింది.
ఎన్విడియా ప్రకటనలో, స్వతంత్ర డైరెక్టర్ల కమిటీతో, న్యాయసలహాదారుల సమక్షంలో విచారణ చేపట్టనున్నట్లు 2026, నవంబర్ 9 న ( సోమవారం ) ఉదయం తెలిపింది. ఈ వ్యవహారంతో జెన్సెన్ హువాంగ్ కంపెనీతో పాటు ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. తన భార్యకు నమ్మకద్రోహం చేశానని అంగీకరించారు. ఈ వ్యవహారం మా పిల్లలను బాధపెట్టాయి. నేను చేసినదానికి ఎలాంటి సాకు చెప్పదల్చుకోలేదు. నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు, బోర్డు సభ్యులు, భాగస్వాములు, వాటాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు సేవ చేయడం, మీ నమ్మకానికి అర్హుడవ్వడం నా బాధ్యత. ఆ బాధ్యతలో నన్ను నేతు తగ్గించుకున్నాను. ఎన్విడియాకు పూర్తిగా కట్టుబడి ఉంటాను. మీ విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు కృషి చేస్తాను అని హువాంగ్ చెప్పారు.
అమెరికా జాతీయ భద్రత లేదా కంపెనీ రహస్య సమాచారం విషయంలో రాజీపడేది లేదని కంపెనీ బోర్డు చెప్పింది. అయినా అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పరిశీలిస్తామని తెలిపింది. హువాంగ్ విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఆయన సీఈఓగా కొనసాగుతారని కంపెనీ స్పష్టం చేసింది.
జాతీయ భద్రత ఆందోళనలు
అలీస్ హువాంగ్ పనిచేసిన సింగపూర్ ఆధారిత మెగాస్పీడ్ కంపెనీ ఎన్విడియా నుంచి ఏఐ చిప్‌లు కొనుగోలు చేస్తోంది. అమెరికా ఎగుమతి నియంత్రణలు ఉన్నప్పటికీ చైనాకు అధునాతన ఏఐ చిప్‌లు అందుతున్నాయనే అనుమానాలపై ఈ కంపెనీపై విచారణ జరుగుతోంది. 2022 నుంచి అమెరికా చైనాకు అధునాతన ఎన్విడియా చిప్‌లు, తయారీ పరికరాలు అందకుండా నియంత్రణలు విధించింది.
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని రిపబ్లికన్ నాయకులు నవంబర్ లో హువాంగ్ను కాంగ్రెస్‌కు బ్రీఫ్ చేయాలని కోరారు. ఆయనకు పంపిన నవంబర్ 4 నాటి లేఖలో, చైనాకు సున్నితమైన అమెరికా సాంకేతికత, సమాచారం అందడంపై జాతీయ భద్రత ఆందోళనలు వ్యక్తం చేశారు.
ఇన్వెస్టర్ల ఆందోళన
ఈ విచారణ ఎన్విడియాపై అదనపు ఒత్తిడి తెస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.5 ట్రిలియన్ డాలర్లు అంటే 422.64 లక్షల కోట్ల రూపాయలు. ఏఐ బూమ్ ఎన్నాళ్లు ఉంటుందోనన అనుమానాలతో షేర్లు ఈ ఏడాది లాభాలన్నీ కోల్పోయాయి. విశ్లేషకుడు డాన్ ఐవ్స్ మాట్లాడుతూ, బోర్డు విచారణ ఫలితంగా హువాంగ్ను సీఈఓ పదవి నుంచి తొలగించే ప్రమాదం ఉందని, ఇది స్టాక్‌పై అదనపు రిస్క్ తెస్తుందని అన్నారు.
