ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల కేబుల్స్ అగ్నికి ఆహుతి

ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 లక్షల కేబుల్స్ అగ్నికి ఆహుతి

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ టెలి సర్వీస్ ముందు వేసిన కేబుల్  అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో పక్కనే పార్కు చేసి ఉంచిన కారుకు మంటలు అంటుకున్నాయి.  2026 నవంబర్ 9 (సోమవారం) జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. సిరి కేబుల్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

 స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి చేరుకున్న  ఉప్పల్ పోలీసులు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నికి ఆహుతైన ఆర్మీ కేబుల్  విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తి నష్టం భారీగానే ఉన్నట్లు  సిరి కేబుల్ సిబ్బంది తెలిపారు.