జియో బంపరాఫర్.. సింగిల్ రీచార్జ్తో మూడేళ్లు అన్ లిమిటెడ్.. ఇంటర్నెట్, ఓటీటీ, కన్వా, మరెన్నో..

జియో బంపరాఫర్.. సింగిల్ రీచార్జ్తో మూడేళ్లు అన్ లిమిటెడ్..  ఇంటర్నెట్, ఓటీటీ, కన్వా, మరెన్నో..

కమ్యూనికేషన్ నెట్వర్క్ లో డిస్రప్షన్ సృష్టించి, కస్టమర్లను తనవైపు తిప్పుకోవడంలో రిలయన్స్ జియో స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలిసిందే.  రావడంతోనే ఫ్రీ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను పెంచుకున్న జియో..  ఇండియాలో మార్కెట్ ను విస్తరించుకుంటూ పోతోంది. లేటెస్టుగా మరో మెగా ప్లాన్ ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఆ తర్వాత ఇతర నెట్ వర్క్ లు కూడా ఫాలో కావాల్సిన పరిస్థితి.  

రిలయన్స్ జియో ఇండియాలోనే తొలిసారిగా మూడేళ్ల అన్ లిమిటెడ్ ప్లాన్ ను ప్రకటించింది. పదివేలతో రీచర్జ్ చేస్తే మూడేళ్ల పాటు నాన్ స్టాప్ నెట్ వర్క్ తో పాటు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్ గా ఉన్న ఆఫర్ తో మరోసారి మార్కెట్ ను షేక్ చేస్తోందనే చెప్పాలి. 

నెట్ వర్క్ కనెక్టివిటీతో పాటు ఓటీటీ నాన్ స్టాప్ స్ట్రీమింగ్, సాఫ్ట్ వేర్ ప్రొడక్టివిటీ, క్లౌడ్ స్టోరేజ్ తదితర సేవలను కేవలం ఒకే రీచార్జ్ తో పొందవచ్చునని ప్రకటించింది. 

ఎలా రీచార్జ్ చేసుకోవాలి:

దీపావళి కానుకగా 2026 నవంబర్ 7 నుంచే ఈ ప్లాన్ లైవ్ లో ఉంటుందని జియో ఇప్పటికే ప్రకటింది.  మై జియో యాప్ ద్వారా లేదా జియో డాట్ కామ్ పోర్టల్ లో లేదంటే జియో స్టోర్ లో రీచార్జ్ చేసుకోవచ్చునని పేర్కొంది. 

ALSO READ : దీపావళి అవ్వగానే పెరిగిన బంగారం రేటు..

ఆఫర్ వివరాలు:

జియో 3 సంవత్సరాల అన్ లిమిటెడ్ ప్లాన్ తీసుకునే సబ్‌స్క్రైరబర్‌లు ఈ కింది బెనిఫిట్స్ పొందుతారని పేర్కొంది. 

  • 3 సంవత్సరాల పాటు అన్ని నెట్‌వర్క్‌లలో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్
  •  రోజుకు 2.5 GB హై-స్పీడ్ డేటా
  • అన్ లిమిటెడ్5G డేటా యాక్సెస్
  •  రోజుకు 100 SMSలు

 సాధారణ సెల్యులార్ కనెక్టివిటీతో పాటు, అనేక ప్రీమియం డిజిటల్ సేవలను అందిస్తోంది.  అందులో  జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్, గేమ్స్ , హాట్‌స్టార్ ఒరిజినల్స్, ప్రీమియం షోలు , హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లను చూడవచ్చు.
దీనికి తోడు  డిజైన్ టెంప్లేట్లు,  క్రియోటివ్ ప్రొడక్ట్స్   12 నెలల యాక్సెస్ ఉంటుంది.
 డాక్యుమెంట్స్, ఫోటోలు  ఫైళ్ల కోసం 50 GB ఉచిత సురక్షిత క్లౌడ్ స్టోరేజ్.