జహీరాబాద్ లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... ఇద్దరికి తీవ్ర గాయాలు..

జహీరాబాద్ లో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... ఇద్దరికి తీవ్ర గాయాలు..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.. సోమవారం ( నవంబర్ 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జహీరాబాద్ అల్లాదుర్గం- మెటల్ కుంట దగ్గర జరిగింది ఈ ఘటన.

న్యాల్ కల్ మండలం న్యామతాబాద్ దగ్గర ఆగి ఉన్న లారీని వెనక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని న్యకల్ కల్ కు చెందిన బొల్లి శ్రీకాంత్, సాయికిరణ్ గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అతివేగం ప్రమాదకరమని..బైక్ పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు పోలీసులు.