దీపావళి రోజున ఛత్తీస్ ఘడ్ లో ఘోరం జరిగింది.ఓ కారు నదిలో పడిపోవడంతో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆదివారం ( నవంబర్ 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఛత్తీస్ ఘడ్ లోని గరియాబంద్‌లోని రాజిమ్‌లో గల టిలా ఆనికట్ దగ్గర జరిగింది ఈ ఘటన. కారు నదిలో పడిపోవడంతో,భార్యాభర్త సహా ఇద్దరు పిల్లలు, మృతి చెందారు.
మృతులను శీతల్ సాహు, అతని భార్య భారతి, వారి పిల్లలైన 19 ఏళ్ల కుమారుడు వికాష్, 21 ఏళ్ల కుమార్తె పూర్వగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను నదిలో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్వగ్రామంలో దీపావళి వేడుకలు జరుపుకోవడానికి రాయ్‌పూర్ నుంచి ప్రయాణిస్తుండగా, కారు నదిలో పడిపోయిందని తెలిపారు పోలీసులు.
మృతురాలు శీతల్ సాహు ఒక జర్నలిస్ట్ అని సమాచారం. సాహుల్ కారుపై 'మీడియా ఎగ్జిక్యూటివ్' అని రాసి ఉంది. ప్రమాదవశాత్తు కారు నదిలో పడిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
