దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది క్రాకర్స్.. చిన్నా, పెద్ద తేడా లేకుండా దీపావళికి మందుగుండు పేల్చి సంబరాలు జరుపుకుంటారు. అయితే.. మందుగుండు వల్ల కాలుష్యం ఏర్పడుతుందని పర్యావరణానికి మంచిది కాదని.. పర్యావరణానికి హాని కలిగించకుండా దీపావళి జరుపుకోవాలని ప్రభుత్వం సూచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మందు గుండు కాలిస్తే రోగాలు తగ్గిపోతాయంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
కోల్కతాలోని తన నియోజకవర్గంలో శనివారం ఒక కమ్యూనిటీలో కాళీ పూజను ప్రారంభిస్తూ టాలీగంజ్ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడుతున్న సమయంలో ఆమె ముందు పెద్ద శబ్దంతో ఒక టపాకాయ పేలగా.. అప్పుడు ఆమె పటాకులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని అన్నారు.
బాణాసంచా లేకుండా కాళీపూజ పూర్తవదని..తప్పకుండ బాణాసంచా కాల్చాలని అన్నారు. అయితే.. పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా పండగ జరుపుకోవాలని అన్నారు. మందు గుండు వల్ల చాలా రోగాలు నయం అవుతాయని అన్నారు.
కోల్కతాలో పలు చోట్ల కాళీ పూజ మండపాలను ప్రారంభిస్తూ సీఎం సువెందు అధికారి అన్న మాటలను ప్రస్తావిస్తూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే పాపియా అధికారి. దీపావళి సందర్భంగా ప్రజలు బాణాసంచా కాల్చుకోవచ్చని.. అయితే, శబ్ద కాలుష్య నియమాలను పాటిస్తూ పర్యావరణానికి హాని కలిగించని బాణాసంచా కాల్చాలని కోరారు సీఎం సువెందు అధికారి.
బాణసంచా నుండి వెలువడే పొగ, సూక్ష్మ కణాలు, ముఖ్యంగా ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది కలిగించచ్చని అన్నారు సీఎం సువెందు అధికారి.
