ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన ఒక వివాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్లుగా.. హువాంగ్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న మహిళ చైనా కోసం గూఢచారానికి పాల్పడిందనే ఆరోపణలు రచ్చ రేపుతున్నాయి. దీనిపై సీఈఓ ఇచ్చిన క్లారిటీతో ఎన్విడియా షేర్లు కూడా పడిపోవడం మార్కెట్లో కలకలం రేపింది.
అయితే ఈ స్పై ఆరోపణలను చైనా ప్రభుత్వం చాలా తీవ్రంగా ఖండించింది. అమెరికా, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని, బీజింగ్‌ను బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గ్యో జియాకున్ స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం తగదని చైనా పేర్కొంది.
జెన్సన్ హువాంగ్ అమెరికా నిఘా వర్గాల రాడార్‌లో ఉన్న ఆలిస్ హువాంగ్ అనే చైనీస్ వ్యాపారవేత్తతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు అంగీకరించారు. ఆమె చైనా కోసం సమాచారాన్ని సేకరిస్తోందని, అంతేకాకుండా అడ్వాన్స్డ్ కంప్యూటర్ చిప్స్‌ను చైనాకు అక్రమంగా రవాణా చేసే కంపెనీని నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో హువాంగ్ ద్వారా ఎన్విడియాకు చెందిన ఏదైనా సున్నితమైన సమాచారం లీకైందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ వివాదం కేవలం వ్యక్తిగత సంబంధాలకే పరిమితం కాకుండా.. ఎన్విడియా సంస్థ చైనాలో సాగిస్తున్న వ్యాపారాలపై కూడా నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ.. చైనా మార్కెట్ కోసం H200 వంటి శక్తివంతమైన AI చిప్స్ అమ్మేందుకు హువాంగ్ గతంలో చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం మరింత వివాదాస్పదంగా మారాయి.
ALSO READ : ఎవరీ ఆలిస్ హువాంగ్ ? జర్నలిస్టు నుంచి ఎన్విడియా సీఈఓతో లింక్..
మరోవైపు చైనా ప్రభుత్వ అనుబంధ మీడియా స్పందిస్తూ.. అమెరికా-చైనా సంబంధాలు మెరుగవుతున్న తరుణంలోనే ఈ నివేదికలు స్పెడ్ చేయటం వెనుక కొందరి కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్విడియా సంస్థ ఇప్పటికే అంతర్గత విచారణకు ఆదేశించగా.. హువాంగ్ వ్యక్తిగత జీవితం, ఆయన వాణిజ్య విధానాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
