యాదాద్రిలో లక్ష్మీ నరసింహుడి సత్యనారాయణ మండపం పరిశీలన.. కార్తీకమాసంలో భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

యాదాద్రిలో లక్ష్మీ నరసింహుడి సత్యనారాయణ మండపం పరిశీలన.. కార్తీకమాసంలో భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు

 కార్తీకమాసం నవంబర్ 10 నుంచి  ప్రారంభమవుతున్న  సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని పరిశీలించిన ఈఓ భవాని శంకర్ పరిశీలించారు.  ఈ నెల రోజులు  అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి జరిగే అవకాశం ఉండటంతో  ఆలయ అధికారులుఏర్పాట్లు చేస్తున్నారు.   వ్రతాల నిర్వహణ,భక్తుల రాకపోకలు,వసతి సౌకర్యాలు,క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాల అమలు తీరును  ఈఓ పరిశీలించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఈఓ ఆదేశించారు. 

భక్తులు సౌకర్యవంతమైన వాతావరణం లో వ్రతాలు నిర్వహించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని   ఈఓ  అధికారులకు సూచించారు.  కార్తీకమాసం  వ్రతాల నిర్వహణ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తూ అన్ని శాఖల అధికారులు సమిష్టి గా కృషిచేయాలని ఈఓ ఆదేశించారు.

ALSO READ : సింహరాశిలోకి కుజుడు.. కార్తీకమాసంలో ఆరు రాశుల వారికి మహాయోగం