టాలీవుడ్ లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి. నలుగురు స్నేహితులు, వారి సరదాలు, ప్రేమలు, గొడవలు, గోవా ట్రిప్.. ఇలా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో అప్పట్లో ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు హీరో విశ్వక్ సేన్, దర్శకుడు తరుణ్ భాస్కర్ సిద్ధమయ్యారు. ఈ కాంబినేషన్లో వస్తున్న 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' (ENE Repeat) కోసం యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
'మిత్వా.. మిత్వా' అంటూ కొత్త జోష్..
ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. లేటెస్ట్ ఈ చిత్రం నుంచి 'మిత్వా.. మిత్వా' అంటూ యూత్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. వినసొంపైన ట్యూన్, ఆకట్టుకునే లిరిక్స్ తో ఈ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. భరద్వాజ్ అందించిన సాహిత్యానికి వివేక్ సాగర్ తనదైన స్టైల్లో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మళ్లీ ఆ నలుగురి సందడి..
2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా ఈఎన్ఈ రిపీట్ రూపొందుతోంది. విశ్వక్ సేన్‌తో పాటు శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను తమ పాత్రలతో మరోసారి అలరించనున్నారు. స్నేహం, కామెడీ, యూత్‌ఫుల్ ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ALSO READ : ఏనుగు వెళ్తుంటే వీధి కుక్కలు మొరుగుతాయి..
మొత్తానికి పాత సినిమా మ్యాజిక్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించేందుకు తరుణ్ భాస్కర్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈసారి ఈ నలుగురు స్నేహితులు ఎలాంటి హంగామా సృష్టిస్తారు? నవంబర్ 19న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తారో చూడాలి..
