జ్యోతిష్యం:జాతకరత్నం.. జన్మరత్నానికి తేడా ఏమిటి..ఈ రెంటిలో ఏది బెస్ట్..!

జ్యోతిష్యం:జాతకరత్నం.. జన్మరత్నానికి తేడా ఏమిటి..ఈ రెంటిలో ఏది బెస్ట్..!

హిందువులు చాలామంది జ్యోతిష్య సిద్దాంతం ప్రకారం పూజలు చేసి జాతక రత్నాలతో ఉంగరాలు ధరిస్తుంటారు. జాతకాన్ని బట్టి రత్నం ధరించాలా.. పుట్టిన తేదీని బట్టి ఉంగరంలో నవరత్నాలో ఏ రత్నం ధరించాలి.. ఈ రెండిటిలో దేని ప్రకారం రత్నాన్ని ధరించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. !

హిందువులు చాలా మంది జ్యోతిష్య పండితులు సంప్రదించి జన్మ లగ్నం ప్రకారం జాతకరత్నాలను ధరిస్తుంటారు. మరికొంతమంది ఇంట్లో పెద్దలు చెప్పారనో.. ఎవరో చెప్పారనో జాతకరత్నాలను ధరిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం .. జన్మలగ్నం ప్రకారం ధరించి జాతిరత్నం జీవితాంత కాలం ఉంటుంది. జాతక చక్రం ప్రకారం ధరించిన జాతి రత్నం మాత్రం ఆ సమయంలో జరిగే మహర్దశ ప్రకారం ధరించాలి. ఆ మహర్ధశలో ఏ గ్రహం ఉంది... జాతక చక్రం ప్రకారం  ఏ కుండలి ( స్థానంలో) ఏ గ్రహం ఉంది.. అది ఏ రాశిలో సంచరిస్తుంది  దాని ప్రకారం జాతక రత్నం ధరించాలి.  జాతకంలో మహర్ధశ మారినప్పుడు జాతక రత్నాన్ని తీసేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మలగ్నం ప్రకారం నిర్దేశించే రత్నం వ్యక్తిగత జీవితానికి అనుగుణంగా ఉంటుంది.ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా జీవితం సాఫీగా ఉండేందుకు ఈ రత్నాన్ని ధరిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనిని పుట్టిన తేది.. నెల.. ఆధారంగా జనన లగ్నాన్ని  జ్యోతిష్య పండితులు లెక్కలు వేస్తారు. అయితే గ్రహాల వలన కలిగే ఇబ్బందులకు ఈ జాతకరత్నానికి ఎలాంటి సంబంధం ఉండదు. 

ఇక జాతక లగ్నం విషయంలో  లగ్న కుండలి ప్రకారం.. ఏ గ్రహం ఏ రాశిలో ఉంది.. ఏ నక్షత్రం.. ఎన్నో పాదంలో సంచరిస్తుంది అనే విషయాల ఆధారంగా జాతక మహర్దశను నిర్ణయిస్తారు.గ్రహాల మహర్దశ ప్రకారం జాతక రత్నాన్ని ధరిస్తారు.

►ALSO READ | నవంబర్ 13న ప్రళయం రాబోతుందా.. : 66 ఏళ్ల నాటి జ్యోతిష్యంపై ఎందుకీ చర్చ..!

మానవుల జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాలు అనుకూలించినప్పుడు అన్ని సాఫీగా సాగిపోతాయి.  అలా కాకుండా గ్రహాలు అనుకూలించనప్పుడు  ఇబ్బందులు వస్తుంటాయి.  ఉద్యోగం.. వ్యాపారం.. ఇతర విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు జ్యోతిష్య నిపుణులు జాతక లగ్నాన్ని పరిశీలించి రత్నాన్ని సూచిస్తారు.  ఆ రత్నం ఎప్పటి వరకు ఉండాలో కూడా చెబుతారు. 

అందుకే ఒకేరాశికి చెందిన ఇద్దరి జీవితాలు ఒకే రకంగా ఉండవు. పుట్టిన లగ్నం ఒకటే  అయినా..మహర్దశలు వేర్వేరుగా ఉంటాయి. జ్యోతిష్య ప్రకారం జాతక రత్నాలు ధరిస్తే వ్యక్తిగత జీవితంలో మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

జాగ్రత్తలు అవసరం

పండితులు సలహాలు తీసుకోకుండా.. జాతక రత్నానికి గాని.. జన్మలగ్నం ప్రకారం రత్నం ధరించకూడు,  జాతక చక్రంలో ఏ గ్రహం బలంగా.. ఏ గ్రహం బలహీనంగా ఉందో తెలుసుకొని బలహీనంగా ఉన్న గ్రహాన్ని బలోపేతం చేసేందుకు జాతకరత్నాలు ఉపయోగపడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా నీలం రత్నం..  శనిగ్రహానికి సంబంధించినది ..జ్యోతిష్య  నిపుణుల సూచన లేకుండా ధరిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.