1960 నవంబర్ 4... ప్రపంచం అంతా దీపావళి సంబరాల్లో ఉండగా, కొందరు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ అంచనా వేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ సమయంలో గ్రహాలన్నీ దాదాపు ఒకే వరుసలోకి వచ్చాయి. దీంతో భూమి అయస్కాంత క్షేత్రం తారుమారై, ప్రపంచం అంతం కావచ్చు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రమాదం తప్పింది.
సరిగ్గా 66 ఏళ్ల తర్వాత - 2026 నవంబర్ 13న - మళ్లీ అదే తరహా గ్రహ సంచారం ఏర్పడబోతోంది. గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తాయని ఆ సమయంలో కొన్ని ఊహించని పరిణామాలు జరిగి ప్రపంచం అంతమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు.. కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ "World End on Nov 13" చర్చ మొదలైంది. అసలు ఆ రెండు రోజుల గ్రహ స్థితి ఒకేలా ఉందా? నిజంగా ప్రమాదం ఉందా? తెలుసుకుందాం.
అప్పుడు... 1960 నవంబర్ 4న ఏం జరిగింది?
1960 నవంబర్ 4న కార్తీక మాసం దీపావళి మరుసటి రోజు బలి పాడ్యమి.జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు తులారాశి నుంచి వృశ్చికరాశి లోకి ప్రవేశిస్తున్నాడు( సంధి సమయం).. కుజుడు, గురుడు సింహ రాశిలో - బలమైన గురు మంగళ యోగం, శని మేషంలో వక్రస్థితిలో , శుక్రుడు, బుధుడు వక్రంలో 5 గ్రహాలు దగ్గరగా వక్ర గమనంలో ఉన్నాయి. ఇన్ని గ్రహాలు దగ్గరగా రావడం వల్ల భూమి అయస్కాంత క్షేత్రం (Magnetic Field) పై ఒత్తిడి పెరిగి, భూకంపాలు, సునామీలు వస్తాయని పండితులు చెబుతుంటారు. కాని ఆ రోజు అలాంటిది ఏమీ జరగలేదు.
అప్పుడు.. ఇప్పుడు గ్రహాల వివరాలు
2026 నవంబర్ 13న ఏం జరగబోతోంది?
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 13, 2026న ఏర్పడే కూటమి 1960 నాటి కూటమికి దాదాపు జిరాక్స్ కాపీ లాంటిది. గ్రహంప్రభావం2026 నవంబర్ 13న స్థితి బుధుడు టెక్నాలజీ, కమ్యూనికేషన్, వృశ్చికంలో 5 డిగ్రీల దగ్గర - మధ్యాహ్నం 3గంటల 54నిమిషాలకు వక్ర స్థితి నుంచి ప్రత్యక్షంగా మారుతన్నాడు. దీని ప్రభావంతో కొన్ని నెలలుగా ఆగిపోయిన సర్వర్లు, నెట్‌వర్క్ సమస్యలు ఒక్కసారిగా క్లియర్ అవుతాయని పండితులు చెబుతున్నారు. కుజుడు, గురుడు సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో కలయిక - శక్తివంతమైన గురు మంగళ రాజయోగం - 66 ఏళ్ల క్రితం ఇదే యోగం ఉంది.
►ALSO READ | నవంబర్ 13న ప్రళయం రాబోతుందా.. : 66 ఏళ్ల నాటి జ్యోతిష్యంపై ఎందుకీ చర్చ..!
పండితులు.. శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచం అంతం కాదు కానీ.. ఒక శకం అంతమవుతుంది. - కొత్త శకం ఆరంభం జరుగుతుంది. బుధుడు ప్రత్యక్ష స్థితి లోనికి రావడం వలన టెక్నాలజీ రంగంలో పెద్ద విప్లవం జరిగే అవకాశం ఉంది. - AI టెక్నాలజీలో లో కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. .శని మేషంలో వక్రం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆగిపోవడం .. కొన్ని దేశాల్లో కొత్త నాయకత్వం రావడం..జరిగే పరిణామాలున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటికే రష్యా.. ఉక్రెయిన్ మధ్య జరిగే పరిణామాల విషయంలోనూ .. అలాగే ఇరాన్.. అమెరికా మధ్య నెలకొన్న యుద్దాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి.
1960లో దీపావళి రోజున ప్రజలు భయపడినట్టే 2026 నవంబర్ 13న కూడా సోషల్ మీడియాలో భయం సృష్టిస్తున్నారు. కానీ ఇది భయపడాల్సిన రోజు కాదు.. - మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలుపెట్టాల్సిన రోజు నవంబర్ 13 మధ్యాహ్నం 3 గంటల54నిమిషాల తర్వాత ఏదైనా కొత్త పని మొదలుపెడితే విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
