Janhvi Kapoor : ముక్కు సర్జరీ చేయించుకున్నాకే హీరోయిన్‌గా ఓకే చెప్పింది.. శ్రీదేవిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Janhvi Kapoor : ముక్కు సర్జరీ చేయించుకున్నాకే హీరోయిన్‌గా ఓకే చెప్పింది.. శ్రీదేవిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే తన అందం, కాస్మెటిక్ సర్జరీల గురించి పలుమార్లు ఓపెన్ గా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవితో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను బయటపెట్టారు. తాను హీరోయిన్  కావాలనుకున్నప్పుు అమ్మ  మొదట్లో అంతగా ఆసక్తి చూపించలేదని .. అయితే ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత తనలో నటిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని భావించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జాన్వీ జేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటిగా మారతానంటే...

తాను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు తన తల్లి శ్రీదేవి వెంటనే అంగీకరించలేదని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చెప్పుకొచ్చారు. నటన అనేది అంత సులభమైన వృత్తి కాదని, ఒకసారి ఈ రంగంలోకి అడుగుపెడితే జీవితాన్నే దానికి అంకితం చేయాల్సి ఉంటుందని చెప్పారట. ఎంతో కష్టపడాలని, అంకితభావంతో పనిచేయాలని తల్లి సూచించినట్లు జాన్వీ గుర్తుచేసుకున్నారు.

ముక్కు సర్జరీ తర్వాతే ఒకే..

అయితే తాను ముక్కుకు సర్జరీ చేయించుకునే ముందు హీరోయిన్‌గా తన భవిష్యత్తుపై అమ్మకు పెద్దగా నమ్మకం ఉండేది కాదని  జాన్వీ చెప్పారు. కానీ సర్జరీ తర్వాత మాత్రం తనలో నటిగా ఎదిగే పొటెన్షియల్ ఉందని భావించినట్లు సరదాగా వెల్లడించారు. అంతేకాదు, తన తల్లి కూడా గతంలో కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

►ALSO READ | ENE Repeat : గోవా గ్యాంగ్ మళ్లీ వస్తోంది..'ఈ నగరానికి ఏమైంది 2' నుంచి యూత్‌ఫుల్ సాంగ్ రిలీజ్!

ఖుషీ కూడా గతంలో ఓపెన్ ...

జాన్వీ సోదరి ఖుషీ కపూర్ సైతం గతంలో లిప్ ఫిల్లర్స్, ముక్కు సర్జరీ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు బహిరంగంగానే స్పందించారు. అందం కోసం చేయించుకునే మార్పులు తప్పు కాదని, అయితే వాటి గురించి నిజాయితీగా ఉండాలని అభిప్రాయపడ్డారు . 2018లో 'ధడక్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించడం జాన్వీ జీవితంలో తీరని లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో అమ్మతో తనకున్న అనుబంధం, ఆమె ఇచ్చిన సలహాలను జాన్వీ మరోసారి గుర్తుచేసుకుంది.