ఓటీటీ సినిమాలంటే ప్రేక్షకులకు ఎప్పుడూ ఓ పండుగే! థియేటర్లలో సినిమా చూసే అవకాశం లేకపోయినా.. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదిస్తూ వీకెండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇక పండుగలు, సెలవులు వచ్చినప్పుడు ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మరింత రెట్టింపవుతుంది. అలాంటి ప్రేక్షకుల కోసం ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అదిరిపోయే కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, టైమ్ ట్రావెల్.. ఇలా విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా జైలర్ 2, రణబాలి వంటి సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఏ సినిమా ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో చూసేద్దాం..
జైలర్ 2 – అమెజాన్ ప్రైమ్ వీడియో
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ 2 ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్న ఈ సినిమా నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
‘జైలర్ 2’ స్టోరీ:
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించిన రీసెంట్ ఫిల్మ్ ‘జైలర్2’. ఈ సినిమాలో జైలర్ ముత్తువేల్ పాండియన్‌గా ఆయన మరోసారి సందడి చేసి అదరగొట్టారు. తనదైన స్టైల్, మాస్ మేనరిజమ్స్‌తో శత్రువులను ఎదుర్కొంటూ కుటుంబం, విధి, ప్రతీకారం చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన పోరాటాలు, రజనీకాంత్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
TIGER MUTHUVEL PANDIAN is back. RELOADED 🔥 #Jailer2OnPrime, Nov 12 @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @vidya_balan @sunpictures @iam_SJSuryah #MithunChakraborty #SurajVenjaramoodu @meramyakrishnan @iYogiBabu https://t.co/AgpP66EEwT
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
రణబాలి – నెట్‌ఫ్లిక్స్
మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం నవంబర్ 13 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుండటంతో వీకెండ్‌లో సినిమా చూడాలనుకునే వారికి మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
రణబాలి స్టోరీ:
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన రణబాలి వీరత్వం, పోరాటం, ప్రతీకారం, భావోద్వేగాల కలయికగా సాగుతుంది. అన్యాయాన్ని ఎదిరించే ఓ వ్యక్తి ప్రయాణం, అతడి పోరాటం, ప్రేమ, కుటుంబ బంధాలు, త్యాగాల చుట్టూ కథ తిరుగుతుంది. భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలు, చారిత్రక వాతావరణం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Singanamala Bobbili Ranabaali osthunnadu 🔥 https://t.co/lNBMTC1aYI
— Netflix India South (@Netflix_INSouth) November 9, 2026
హ్యాపీ జర్నీ – సన్ నెక్స్ట్
బెంగళూరు జర్నీలో యాదృచ్ఛికంగా కలిసే ఐదుగురు అపరిచితుల మధ్య సాగే ఒక షార్ట్ అండ్ స్వీట్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో ఆమని, జినిషా అలిశెట్టి, అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునయన, రూప శ్రీనివాస్, రవి శివతేజ, వంశీధర్ గౌడ్ తదితరులు.
నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే వినోదాన్ని పంచేందుకు హ్యాపీ జర్నీ సిద్ధమవుతోంది. నవంబర్ 13 నుంచి సన్ నెక్స్ట్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. వీకెండ్‌లో కొత్త సినిమా చూడాలనుకునే వారికి ఇది మరో ఆప్షన్.
►ALSO READ | Hanuman Ansh OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హనుమాన్ అంశ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
కథ: సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన, శ్రీలత, తన్వి, దివ్య, విహాన అనే ఏడుగురు మహిళలకు లక్కీ డ్రాలో ఉచితంగా యూరప్ వెళ్లే అవకాశం వస్తుంది. సరదాగా ప్రారంభమైన ఆ ప్రయాణం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చింది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయనేది ఈ చిత్ర కథ.
Mark your calendar! A Complete Family Entertainer #HappyJourney streaming on Sun NXT from 13 NOV. #SunNXT #SunNXTNewReleases #HappyJourneyOnSunNXT #TeluguMovie https://t.co/WZht5K25gy
— SUN NXT (@sunnxt) November 10, 2026
దాయిరా (Daayra) – నెట్‌ఫ్లిక్స్
ఇదొక బాలీవుడ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకూమారన్, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్ ఇందులో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్లుగా (DCPs) నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ (రాజీ, తల్వార్ సినిమాల దర్శకురాలు) దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, నవంబర్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది.
కథాంశం: 2019లో హైదరాబాద్‌లో జరిగిన 'దిశా' అత్యాచారం మరియు ఆ తర్వాత జరిగిన నిందితుల పోలీస్ ఎన్‌కౌంటర్ వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చట్టాన్ని గౌరవించడం మరియు తక్షణ న్యాయం అందించడం మధ్య ఉండే నైతిక సంఘర్షణను ఇందులో చూపించారు.
📢 OFFICIAL ANNOUNCEMENT 💥 #Daayra (Hindi) Streaming from November 13 on Netflix 🍿!! #OTT_Trackers https://t.co/t4tLcrGtHn
— OTT Trackers (@OTT_Trackers) November 7, 2026
బాంద్రా – జీ5
తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ డ్రామా సినిమా 'బాంద్రా' (Bandra) ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, డ్రామా అంశాలతో తెరకెక్కిన బాంద్రా నవంబర్ 13 నుంచి అందుబాటులోకి రానుంది.
కథ:
1990ల నాటి బాలీవుడ్ నటి తార జానకి (తమన్నా) తన దత్తత తల్లి, అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న నిర్మాత వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కేరళకు చేరుకుని అలెగ్జాండర్ డొమినిక్ (దిలీప్) కుటుంబం వద్ద ఆశ్రయం పొందుతుంది. అయితే ఆమెను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తులతో కథ ముంబైకి చేరుతుంది. ఆ తర్వాత రొమాన్స్, ఎమోషనల్ డ్రామా, గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్‌తో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
#Bandra (Malayalam) Streaming from November 13 on Zee5 🍿!! #OTT_Trackers https://t.co/PYf1buL0iD
— OTT Trackers (@OTT_Trackers) November 5, 2026
ది థర్డ్ మర్డర్ – మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్
మలయాళ సైకలాజికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ 'ది థర్డ్ మర్డర్' (The Third Murder) నవంబర్ 13, 2026 నుండి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
కథ: ఒక వ్యాపారవేత్త, మరో డ్రగ్ పెడ్లర్ దారుణ హత్యలకు గురవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఒకే తరహాలో జరిగిన ఈ హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే క్రమంలో పోలీసులకు ఎదురయ్యే సైకలాజికల్ మైండ్ గేమ్స్‌తో కథ ఉత్కంఠగా సాగుతుంది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి రివ్యూలను సొంతం చేసుకుంది.
#TheThirdmurder (2026) | Malayalam Streaming on Manoramax From November 13… Audio: Malayalam only https://t.co/G0WMb2ZfvD
— KUDALINGAM MUTHU (@KUDALINGAM49671) November 10, 2026
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల సందడి కూడా!
ఈ వారం ఓటీటీలో సినిమాలే కాదు.. ఉత్కంఠ రేకెత్తించే వెబ్ సిరీస్‌లు కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ముఖ్యంగా రెండు విభిన్నమైన కథాంశాలతో రూపొందిన సిరీస్‌లు ఆసక్తిని పెంచుతున్నాయి.
పుష్పక విమానం– జియోహాట్‌స్టార్
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పుష్పక విమానం వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కాలంతో ముడిపడిన కథాంశం, విభిన్నమైన మలుపులతో సాగనున్న ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక కావొచ్చు.
Join Pushpak Rao on his mind-bending, time-twisting ride! ⏳🔥 #PushpakaVimanam streaming on JioHotstar from November 12th! 💫 #PushpakaVimanamOnJioHotstar #HotstarSpecials #JioHotstar https://t.co/VRqbzszbd7
— JioHotstar Malayalam (@JioHotstarMal) November 6, 2026
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్– జియోహాట్‌స్టార్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నుంచి వస్తున్న డార్క్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సిరీస్‌లో ఎలాంటి క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
వీకెండ్‌కు ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్..
మొత్తంగా చూస్తే ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదం అందించేలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్యూ కట్టాయి. నవంబర్ 12న జైలర్ 2, పుష్పక విమానం స్ట్రీమింగ్‌తో సందడి మొదలుకానుండగా.. నవంబర్ 13న ఏకంగా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో మీరు ఏ సినిమాతో ఎంటర్‌టైన్ అవ్వబోతున్నారనేది ఆసక్తిగా మారింది
Picture-perfect gang, not-so-perfect secrets! Hotstar Specials: Student Of The Year - After Dark, streaming from 13th November, only on JioHotstar. #SOTYAfterDarkOnJioHotstar @shanayakapoor #ManyaGrover #DivikSharma #AdiMalik #AbhinavSingg #Deeyadamini #KaranJohar @adarpoonawalla @apoorvamehta18 @somenmishra0 #ReemaMaya #DebashishIrengbam @Dharmatic_ @sonymusicindia
— JioHotstar (@JioHotstar) November 10, 2026
