గోల్డ్ రేట్లలో సడెన్ క్రాష్.. హైదరాబాదులో గ్రాము ఎంత తగ్గిందో తెలుసా?

గోల్డ్ రేట్లలో సడెన్ క్రాష్.. హైదరాబాదులో గ్రాము ఎంత తగ్గిందో తెలుసా?

దీపావళి పండుగ ముగిసిన తర్వాత బంగారం రేట్లు పెరగటం సాధారణ మధ్యతరగతి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా మంగళవారం రోజున పసిడి ధరలు పడిపోవటం కొత్తగా షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్. 

నవంబర్ 10న బంగారం రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 49 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 441గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 210గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 10, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షల 5 వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.205 దగ్గర ఉంది. 

మరిన్ని వార్తలు