బీజేపీ నేత ఇంటికి మమ్ముట్టి.. రాజకీయ దుమారం

బీజేపీ నేత ఇంటికి మమ్ముట్టి..  రాజకీయ దుమారం

మళయాలం సూపర్ స్టార్ మమ్ముట్టిపై తీవ్ర రాజకీయ దుమారం నడుస్తోంది. బీజేపీ నేత ఇంటి వెళ్లడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజన, మత రాజకీయాలు చేసే వారితో మమ్ముట్టి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

కేరళ బీజేపీ వైస్ ప్రసిడెంట్ బి.గోపాలకృష్ణన్ ఇంటికి వెళ్లడంపైనే దుమారం చెలరేగింది. ఇటీవల బీజేపీ నేత కూతురు పెళ్లికి ఆహ్వానించగా హాజరు కాలేకపోయారు మమ్ము్ట్టి. పెళ్లి తర్వాత వెళ్లి కలిశారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. దీనిపై ముఖ్యంగా లెఫ్టిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యక్తిగత సంబంధాలను రాజకీయ కోణంలో చూడవద్దని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. అయితే సీపీఎం(ఐ) సీనియర్ లీడర్లు మాత్రం ఈ వివాదానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. 

థ్రిస్సూర్ లోని గోపాలకృష్ణన్ ఇంటికి 2026 నవంబర్ 8 (ఆదివారం) వెళ్లారు మమ్ముట్టి. నవంబర్ 1న గురవాయూర్ లో జరిగిన పెళ్లికి హాజరు కానందున ఇంటికి వెళ్లి శుభాకంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ పెళ్లికి కేరళ సీఎం వీడీ సతీషన్, విపక్ష నేత పినరయి విజయన్, రాష్ట్ర, కేంద్ర మంత్రులతో పాటు సీపీఎం(ఐ) నేతలు కూడా హాజరయ్యారు. 

అప్పుడలా.. ఇప్పుడిలా..

అయితే గతంలో కొండచరియలు విరిగిపడినపుడు మమ్ముట్టి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పట్లో బాధితులకు సాయం చేసేందుకు వెళ్లే క్రమంలో.. తనతో రావద్దని సీపీఎం(ఐ) నేతలను కోరారు మమ్ము్ట్టి. మీరు వస్తే నన్ను పార్టీతో అనుబంధం ఉన్నట్లు భావిస్తారని.. తనకు దూరంగా ఉండాలని కోరారు. తన పర్యటనను రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. దీన్ని పోల్చుతూ.. మరి ఇప్పుడు బీజేపీ నేతతో సాన్నిహిత్యం ఎలా మెయింటైన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

మమ్ముట్టి గోపాలకృష్ణన్ ను సపోర్ట్ చేస్తున్నట్లు అనిపించడం లేదా.. ఆయన పూర్తిగా హిపోక్రైట్ అంటూ ఫేస్ బుక్ లో ఒక యూజర్ పోస్ట్ పెట్టారు. 

ALSO READ : జెన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హువాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పదవికి ఎసరు?.

కేరళలలో అతిపెద్ద మతవాది, విభజనవాది అయిన గోపాల కృష్ణన్ ను మమ్ము్ట్టి కలవడంలో ఆంతర్యమేమిటి.. ఆయనలో అంత స్పెషలేంటి..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరి కొందరు మమ్ముట్టికి మద్ధతుగా నిలుస్తున్నారు. నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న నేత కేరళకు గర్వకారణం అని.. ఆయనను రాజకీయాల్లోకి రావద్దని కోరుతున్నారు.