నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హతలు: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బి.టెక్ / బీఈతోపాటు ఎం.టెక్ / ఎంఈ పూర్తిచేసి ఉండాలి. లేదా సంబంధిత సైన్స్ విభాగాల్లో ఎంఎస్సీ కలిగి ఉండాలి. అభ్యర్థులు జాతీయ స్థాయి పరీక్షలైన గేట్ లేదా నెట్లో అర్హత సాధించి ఉండాలి.
ప్రాజెక్టుకు సంబంధించిన పరిశోధన రంగంలో ల్యాబ్ అనుభవం, కోడింగ్ లేదా అనలిటికల్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 27.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్nitw.ac.inను సందర్శించండి.
–వెలుగు, ఎడ్యుకేషన్
