న్యూఢిల్లీ: ప్రపంచ చిప్ తయారీ రంగంలో టాప్కంపెనీ ఎన్విడియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీ ఫౌండర్, సీఈఓ జెన్సన్ హువాంగ్ను పదవి నుంచి తొలగించే అధికారం సంస్థ డైరెక్టర్ల బోర్డుకు ఉందని ఓ నివేదిక వెల్లడించింది. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదైనా, కోర్టులో నేరం రుజువై ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. బోర్డులో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే హువాంగ్ను ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి తప్పించవచ్చని ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం తెలిపింది.
అయితే సీఈఓ పదవి నుంచి తొలగించడం, బోర్డు డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. హువాంగ్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలంటే వాటాదారుల ఆమోదం తప్పనిసరి. ఇందుకు కారణం చూపితే మెజారిటీ వాటాదారుల మద్దతు అవసరం. ఎలాంటి కారణం వెల్లడించకుండా తొలగించాలంటే కంపెనీ మొత్తం ఓటింగ్ హక్కుల్లో కనీసం 66.67 శాతం వాటా కలిగినవారి మద్దతు పొందాలి. చైనా గూఢచారిగా భావిస్తున్న మహిళ ద్వారా హువాంగ్ను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలపై ఎన్విడియా కూడా స్వతంత్ర విచారణ ప్రారంభించింది.
