సీఎస్కేతో ట్రేడ్ చర్చలు.. రిషభ్ పంత్ విషయంలో ఢిల్లీకి అశ్విన్ స్ట్రాంగ్ మెసేజ్! 

సీఎస్కేతో ట్రేడ్ చర్చలు.. రిషభ్ పంత్ విషయంలో ఢిల్లీకి అశ్విన్ స్ట్రాంగ్ మెసేజ్! 

ఐపీఎల్ 2027 ట్రేడింగ్ డెడ్‌లైన్ దగ్గరపడుతున్న వేళ క్రికెట్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ బయటకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తమ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు అప్పగించేందుకు తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. స్పిన్‌కు అడ్డా అయిన చెన్నైలోని చెపాక్ స్టేడియానికి అక్షర్ లాంటి వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ వెళ్తే సీఎస్‌కే రాత మారిపోవడం ఖాయం. అయితే ఈ క్రేజీ ట్రేడ్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ 'Ash ki Baat' వేదికగా స్పందిస్తూ ఢిల్లీ వ్యూహాన్ని తప్పుపట్టారు.

అక్షర్‌ను ఇస్తే సీఎస్‌కే నుంచి ఢిల్లీకి ఎవరొస్తారు?: 

ఇప్పటికే రిషభ్ పంత్ ట్రేడ్ డీల్‌లో భాగంగా కుల్‌దీప్ యాదవ్‌ను లక్నోకు పంపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్పిన్ విభాగంలో తీవ్ర కొరత ఏర్పడింది. అక్షర్‌ను కూడా వదులుకుంటే సీఎస్‌కే నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లను ఢిల్లీ డిమాండ్ చేసే ఛాన్స్ ఉందని ఆర్. అశ్విన్ విశ్లేషించారు. 

* డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis): సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ మెంటార్‌గా పని చేసిన సౌరవ్ గంగూలీకి 'బేబీ ఏబీ' బ్రెవిస్ బ్యాటింగ్ పవర్‌పై పూర్తి నమ్మకం ఉంది. దాంతో అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుబట్టవచ్చు.

* నూర్‌ అహ్మద్ (Noor Ahmed): కుల్‌దీప్ లేని లోటును భర్తీ చేసేందుకు వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయిన నూర్‌ను సీఎస్‌కే నుంచి లాక్కోవడంపై ఢిల్లీ ఫోకస్ పెట్టనుంది. 

ఢిల్లీ నెక్స్ట్ కెప్టెన్ గా పంత్ వద్దు.. రాహులే బెటర్: 

ఒకవేళ అక్షర్ పటేల్ సీఎస్‌కేకి వెళ్తే ఢిల్లీకి కొత్త కెప్టెన్ అవసరమవుతాడు.. ఈ స్థానంలో మళ్లీ రిషభ్ పంత్‌కు జట్టు పగ్గాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ చేయడమే పర్ఫెక్ట్ ఛాయిస్ అని రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. కేఎల్ రాహుల్ అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్, పంత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజసిద్ధమైన విధ్వంసకర ఆట ఆడాలి.. పంత్‌ను ఒప్పించి కెప్టెన్సీ భారం తీసేసి కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడేలా చూడగల సామర్థ్యం ఒక్క ‘దాదా’ (సౌరవ్ గంగూలీ)కి మాత్రమే ఉందని అశ్విన్ తెలిపాడు. 

ఢిల్లీ అక్షర్‌ను వదులుకోవడం బ్లండర్ మిస్టేకే: 

* క్రికెటింగ్ వ్యూహాల పరంగా చూస్తే అక్షర్ పటేల్‌ను వదులుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసే అతి పెద్ద తప్పు అవుతుందని అశ్విన్ పేర్కొన్నాడు.  

* ఇండియన్ ఆల్ రౌండర్: 4 ఓవర్ల కట్టుదిట్టమైన స్పిన్‌తో పాటు 5, 6, 7 స్థానాల్లో మ్యాజ్ ఫినిషింగ్ చేయగల క్వాలిటీ ఉన్న ఇండియన్ ఆల్‌రౌండర్లు ఐపీఎల్‌లో చాలా అరుదు.

* సీఎస్‌కేకి బంపర్ ఆఫర్: స్పిన్‌కు బాగా సహకరించే చెపాక్ పిచ్‌పై అక్షర్ దొరికితే సీఎస్‌కేని ఆపడం ఎవరి తరం కాదు.. తమ సొంత కెప్టెన్‌ను ప్రత్యర్థికి ఇచ్చి బలపరచడం ఢిల్లీకి ఏ రకంగానూ కలిసిరాదు. ఈ క్రేజీ ట్రేడ్ నిజంగానే కార్యరూపం దాలుస్తుందో లేదో చూడాలంటే నవంబర్ 17వ తేదీ రిటెన్షన్ డెడ్‌లైన్ వరకు వేచి చూడాల్సిందే అని అశ్విన్ తెలిపాడు.