టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌దే ఫస్ట్ బ్యాటింగ్.. మళ్లీ వర్షం స్టార్ట్

టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌దే ఫస్ట్ బ్యాటింగ్.. మళ్లీ వర్షం స్టార్ట్

India vs New Zealand: హెమిల్టన్‌లోని సెడన్ పార్క్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో కివీస్ మరోసారి మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రానుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఇండియన్ టీమ్ ఉండగా, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో పట్టు సాధించాలని బ్లాక్ క్యాప్స్ టీమ్ చూస్తోంది. 

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. వాతావరణం త్వరగా క్లియర్ అవుతుందని ఆశిస్తున్నాం, గత మ్యాచ్‌లలో మేము చేసిన మంచి ప్రదర్శనలనే ఈరోజు కూడా పునరావృతం చేస్తాం.. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగడం కాస్త నిరాశ కలిగిస్తోంది.. అయితే మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు, గత మ్యాచ్‌ ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగుతున్నామని గిల్ పేర్కొన్నాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము కూడా బౌలింగ్ తీసుకునే వాళ్లం.. మేము నిన్న మంచి ప్రాక్టీస్ చేశాం.. పిచ్ చాలా రోజులుగా కవర్ల కిందనే ఉండటంతో మ్యాచ్ ప్రారంభంలో బౌలర్లకు కొద్దిగా సహకరించవచ్చు.. గత మ్యాచ్‌లో ఇక్కడ 180 పరుగులు అనేది మంచి స్కోరు అయ్యేది, కానీ ఈరోజు పిచ్ పరిస్థితిని బట్టి ముందుగా అంచనా వేసి ఆడతాం.. మా జట్టులో ఒక మార్పు చేశాం.. బ్లేర్ టిక్నర్ స్థానంలో ఫిషర్ (Fisher) జట్టులోకి వచ్చాడని శాంట్నర్ వెల్లడించాడు. 

ఇరు జట్లు: 

న్యూజిలాండ్: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామీసన్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్