సిల్హెట్: టార్గెట్ ఛేజింగ్‌లో తౌహిద్ హ్రిదోయ్ (82) గట్టిగా పోరాడటంతో.. వెస్టిండీస్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ డ్రాతో గట్టెక్కింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ జట్టు 1–0 తేడాతో కైవసం చేసుకుంది. విండీస్ నిర్దేశించిన 369 రన్స్ లక్ష్య ఛేదనలో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 184/4 స్కోరు చేసింది.
ముష్ఫికర్ రహీమ్ (49), తౌహిద్ మూడో వికెట్‌కు 135 రన్స్ జోడించి మ్యాచ్‌ను డ్రావైపు తీసుకెళ్లారు. అంతకుముందు 345/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌ను 93 ఓవర్లలో 398/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కావెమ్ హెడ్జ్ (142), కెవిన్ విక్హామ్ (78) రాణించారు. తౌహిద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, వారికాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
