- 16 మంది ప్యానెలిస్టులు, 49 మంది అధికార ప్రతినిధులు
- ఆరుగురు విప్‌లు, ఆరుగురు ఎమ్మెల్యేలకు మీడియా ప్యానెల్‌లో చోటు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) మీడియా విభాగంలో భారీగా నూతన నియామకాలు జరిగాయి. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదేశాల మేరకు పీసీసీ మీడియా ప్యానెలిస్టులు, మీడియా కో-ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులను నియమిస్తూ పీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న అధికార ప్రతినిధులందరినీ సీనియర్ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో పార్టీ వాదనను వినిపించేందుకు 16 మందితో కూడిన మీడియా ప్యానెలిస్ట్‌ల జాబితాను ఖరారు చేశారు. ఇందులో శాసనసభ, మండలిలో ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, డాక్టర్ జె.రామచంద్ర నాయక్, బల్మూరి వెంకట్‌లకు చోటు దక్కింది. వీరితోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ సి.వంశీకృష్ణ, టి.రామ్మోహన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి ఉన్నారు. అలాగే, మాజీ విప్ అనిల్ ఈరవత్రి, మాజీ చైర్మన్ టి. బెల్లయ్య నాయక్, సామ రామ్మోహన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్.చరణ్ కౌశిక్ యాదవ్‌లను ప్యానెలిస్టులుగా నియమించారు.
నలుగురితో మీడియా సమన్వయ కమిటీ
మీడియా సమన్వయం కోసం నలుగురితో కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించారు. ఇందులో మీడియా చీఫ్ కో-ఆర్డినేటర్‌గా కె. శ్రీకాంత్ యాదవ్, కన్వీనర్‌గా దామోదర్ ఆవేలి వ్యవహరించనున్నారు. మీడియా కో-ఆర్డినేటర్లుగా తుమ్మల పద్మ, మొగిలి సత్యారెడ్డి నియమితులయ్యారు. పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు 49 మందితో అధికార ప్రతినిధుల బృందాన్ని నియమించారు.
ఈ జాబితాలో గద్దల హైమావతి, సుంకరి మల్లేశ్ గౌడ్, దివ్యవాణి, బీఎన్ రెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, అనిత జక్కాని, బోయ నగేశ్, కోట్ల శ్రీనివాస్, నంగి దేవేందర్ రెడ్డి, బెక్కిం వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ బోడేపూడి రాజా, పెరిక శ్యామ్, నుమాన్ మహ్మద్, కె.నేహా రెడ్డి, కమలాకర్ మెడగోని, రేఖాగౌడ్, గిరి కొండల్ రెడ్డి, పర్రెపాటి యుగంధర్, పద్మ, చింతల నిర్మలారెడ్డి, నాగలక్ష్మి, వాసిరెడ్డి నరేశ్, వంగల వెంకన్న గౌడ్, ఎస్కే సిరాజ్ హుస్సేన్, షేక్ ముఖ్తార్ అహ్మద్, రూప తదితరులు ఉన్నారు.
