హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ (టీపీఎంసీసీ) నూతన రాష్ట్ర కార్యవర్గంతో పాటు 22 జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో టీపీఎంసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ కమిటీని అధికారికంగా ప్రకటించారు.
నూతన రాష్ట్ర కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు కార్యదర్శులకు చోటు లభించింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
