డిగ్రీ, పీజీ చేసిన వారికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు

డిగ్రీ, పీజీ చేసిన వారికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏఈఈఎస్) దేశవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో టీచింగ్, నాన్-–టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

మొత్తం ఖాళీలు: 254.

విభాగాల వారీగా ఖాళీలు: ప్రిన్సిపాల్ 4,  వైస్ -ప్రిన్సిపాల్ 1,  పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) 27,  ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) 102,  లైబ్రేరియన్ 13,  ప్రైమరీ టీచర్ (పీఆర్​టీ) 89,  ప్రైమరీ టీచర్ (మ్యూజిక్)10,  బాల్‌వాటిక టీచర్ 8.

విద్యార్హతలు

ప్రిన్సిపాల్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు బి.ఎడ్ లేదా సమానమైన ఇంటిగ్రేటెడ్ టీచింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో / అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో తగినంత సర్వీస్ అనుభవం  తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

వైస్ ప్రిన్సిపాల్: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు  బీఎడ్  లేదా సమానమైన ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. బోధనా రంగంలో తగిన సర్వీస్ అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్ బోధన, డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పీజీటీ: సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమోదించిన బి.ఎడ్ లేదా సమానమైన ఇంటిగ్రేటెడ్ టీచింగ్ క్వాలిఫికేషన్ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

పీజీటీ (కంప్యూటర్ సైన్స్):  ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ / ఐటీ  లేదా ఎంసీఏ  లేదా సంబంధిత బ్రాంచ్‌లో ఎంఈ / ఎం.టెక్  పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట  వయోపరిమితి: 40 ఏళ్లు. 

టీజీటీ:  సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సమానమైన ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. బి.ఎడ్  లేదా సమానమైన ప్రెస్క్రైబ్డ్ టీచింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సిటెట్) ఉత్తీర్ణులై ఉండాలి.

టీజీటీ (కంప్యూటర్ సైన్స్): సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీసీఏ/ బీఈ లేదా బీటెక్  కలిగి ఉండాలి. దీంతోపాటు తప్పనిసరిగా బి.ఎడ్ పూర్తిచేసి ఉండాలి.
టీజీటీ (ఫిజికల్ & హెల్త్ ఎడ్యుకేషన్: ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు బీపీ.ఎడ్. పూర్తిచేసి ఉండాలి.

టీజీటీ (ఆర్ట్ ఎడ్యుకేషన్):ఫైన్ ఆర్ట్స్​లో డిగ్రీ కలిగి ఉండటంతోపాటు బీ.ఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు. 
లైబ్రేరియన్: లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సులో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డిజిటల్ లైబ్రరీ నిర్వహణ, కంప్యూటర్ ఆధారిత రికార్డుల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు. 

ప్రైమరీ టీచర్ (పీఆర్​టీ, మ్యూజిక్): ఇంటర్మీడియట్ / 12వ తరగతితోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో నిర్దేశిత అర్హత కలిగి ఉండాలి. 
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తొలి పేపర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంగీతం లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్​లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
బాల వాటిక టీచర్: ఇంటర్మీడియట్/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నర్సరీ ఎడ్యుకేషన్, ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ లేదా ఎర్లీ చైల్డ్‌ హుడ్ ఎడ్యుకేషన్‌లో నిర్దేశిత అర్హత పూర్తిచేసి ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 2.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ రూ.1000, మహిళలు, ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ aees.onlineregistrationformscom.ను సందర్శించండి.


–వెలుగు, ఎడ్యుకేషన్