హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) తాత్కాలిక ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: నర్స్ 5 (మహిళలు 3, పురుషులు 2), ఫార్మసిస్ట్ 1, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ 1.
విద్యార్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ బీఎస్సీ (నర్సింగ్) లేదా సమాన కోర్స్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌తోపాటు జీఎన్‌ఎం డిప్లొమా కలిగి ఉండాలి.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సుగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కనీసం రెండేళ్ల నర్సింగ్ అనుభవం ఉండాలి.
కనీసం 50 శాతం మార్కులతో బి.ఫార్మా లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ అయి ఉండాలి.
కనీసం ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి.
సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా సమాన కోర్సుతోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్టీ) లేదా సమాన కోర్స్ పూర్తిచేసి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్‌గా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: 32 ఏళ్లు దాటకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 18.
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 10:00 గంటలకు.
ఇంటర్వ్యూ వేదిక: కమిటీ రూమ్, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500032.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.manuu.ac.inను సందర్శించండి.
–వెలుగు, ఎడ్యుకేషన్
