ఐపీఎల్ (IPL 2027) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 17న 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను అధికారికంగా ప్రకటించనున్నాయి. స్టార్ స్పోర్ట్స్, జియోస్టార్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రత్యేక షో ద్వారా ఈ వివరాలు వెల్లడించనున్నారు. డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలానికి ముందే ఇప్పటికే 3 ట్రేడ్ డీల్స్ ద్వారా 8 మంది ఆటగాళ్లు జట్లు మారగా, మరో డీల్‌పై ప్రకటన రావాల్సి ఉంది. కాగా గత రెండు సీజన్లలో (2025, 2026) పేలవ ప్రదర్శన కనబరిచిన నాలుగు ప్రధాన ఫ్రాంచైజీలు తమ జట్లను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యాయి.
గ్రీన్, పతీరణలను వదిలి పెట్టనున్న కేకేఆర్:
2024 ఛాంపియన్ కేకేఆర్ ఆ తర్వాత తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో జట్టును పూర్తిగా రీ-బిల్డ్ చేయాలని భావిస్తోంది. భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసిన ఓవర్సీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, శ్రీలంక పేసర్ మతీష పతీరణలను వదిలేయనుంది. అజింక్యా రహానే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలను మాత్రమే ఉంచుకుని మిగిలిన వారిని వేలంలోకి వదిలి పెట్టేందుకు కేకేఆర్ ప్లాన్ చేస్తోంది.
CSK కొత్త కోచింగ్ స్టాఫ్.. టీమ్‌లో ప్రక్షాళన:
* ఐపీఎల్ 2027 సీజన్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేసి, ఇప్పుడు ప్లేయర్లను ప్రక్షాళన చేయనుంది.
* ట్రేడ్ డీల్స్: నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఇచ్చి లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను ఇప్పటికే జట్టులోకి తెచ్చుకుంది.
* రిలీజ్ లిస్ట్: రాహుల్ చాహర్, దీపక్ హుడా, కార్తిక్ శర్మలను మినీ వేలంలోకి వదిలేయనుంది.
ముంబై నుంచి హార్దిక్ ఔట్.. రోహిత్/తిలక్ కు కెప్టెన్సీ?
* ముంబై ఇండియన్స్ కూడా మరోసారి సత్తా చాటేందుకు కోచింగ్ స్టాఫ్ నుంచి ప్లేయర్ల వరకు బిగ్ చేంజెస్ చేస్తోంది.
* హార్దిక్ ఎగ్జిట్: కెప్టెన్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ జట్టుకు పంపించి స్టార్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్‌ను తెచ్చుకునే ప్లాన్‌లో ముంబై ఇండియన్స్ ఉంది.
* రిలీజ్ లిస్ట్: దీపక్ చాహర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ డికాక్‌లను వదిలేయబోతుంది.
* రిటైన్డ్ ప్లేయర్స్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మలను రిటైన్ చేసుకోనుంది. రోహిత్ శర్మ లేదా తిలక్ వర్మకి సారథ్య బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
లక్నో నుంచి పంత్ ట్రెండ్.. షమీ, పూరన్‌లు రిలీజ్?
* 2026 సీజన్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.
*పంత్ ట్రేడ్: రిషభ్ పంత్‌ను ఢిల్లీకి ఇచ్చేసి బౌలర్ కుల్‌దీప్ యాదవ్‌ను తెచ్చుకుంది.
* రిలీజ్ లిస్ట్: నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, మోహ్‌సిన్ ఖాన్, మహమ్మద్ షమీ, వానిందు హసరంగా, జోష్ ఇంగ్లీస్‌లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
