India vs New Zealand 3rd ODI: హెమిల్టన్‌లోని సెడన్ పార్క్ వేదికగా ఈరోజు (2026, నవంబర్ 10, మంగళవారం) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు మైదానాన్ని నిశితంగా పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
టాస్ పడినా పడని బంతి:
మ్యాచ్‌కు ముందు పిచ్ కవర్ల కింద ఉండటంతో మొదట టాస్ కూడా సుమారు 2 గంటల పాటు ఆలస్యమైంది. ఆ తర్వాత ఆలస్యంగా టాస్ నిర్వహించగా.. భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. కానీ ఆట ప్రారంభమయ్యే క్షణాల్లోనే వర్షం మళ్లీ విరుచుకుపడటంతో ఆటగాళ్లు మైదానంలోకి రాలేకపోయారు. సుదీర్ఘంగా వేచి చూసినప్పటికీ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఇరు జట్ల కెప్టెన్లకు తెలియజేశారు.
ఈ సిరీస్ లో నెక్ట్స్ మ్యాచ్‌లు:
భారత్ 2–0 ఆధిక్యం: ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా 5 వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2–0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
నెక్స్ట్ డెస్టినేషన్ (మౌంట్ మాంగనుయ్): సిరీస్‌లోని చివరి రెండు వన్డేలు (4, 5వ వన్డేలు) వరుసగా శుక్రవారం (నవంబర్ 13), ఆదివారం (నవంబర్ 15) మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ (Bay Oval) వేదికగా జరగనున్నాయి. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని భావిస్తుండటంతో, తదుపరి మ్యాచ్‌లని పూర్తి స్థాయిలో చూడవచ్చని న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
𝗨𝗽𝗱𝗮𝘁𝗲 𝗳𝗿𝗼𝗺 𝗛𝗮𝗺𝗶𝗹𝘁𝗼𝗻: The third New Zealand-India ODI is called off due to rain. #TeamIndia | #NZvIND https://t.co/LtrfDalRcz
— BCCI (@BCCI) November 10, 2026
