పండుగల వేళల్లో మన ఆనందం కోసం కాల్చే టపాసుల భారీ శబ్దాలు మూగజీవుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పండుగ వేళ విచ్చలవిడిగా కాల్చే బాణసంచా మోతలకు కోతులు, కుక్కలు, పిల్లులు ,పక్షులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. మనుషుల కంటే జంతువులకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ శబ్దాలు వాటికి నరకం చూస్తున్నాయి. టపాసుల పేలుడు శబ్దాలకు వణికిపోతున్న ఓ తల్లి కోతి, పిల్ల కోతి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. మనుషులుగా మూగజీవాలను ఆదుకోవాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కిచెపుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో క్లిప్ లో మూడు కోతులు ఓ ఇంటి బాల్కనీలో ఓ మూలన బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తూ భయంతో వణికిపోతూ కూర్చున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు చూసేవారి హృదయాలను కలచివేస్తున్నాయి. ఒక్కో బాంబు పేలుడు శబ్ధానికి పిల్లకోతి భయంతో వణికిపోతూ తల్లి కోతిని అల్లుకుంటుంటోంది. భయపడకు బిడ్డా అంటూ తల్లికోతి దానికి ధైర్యం చెబుతున్నట్లు, పక్కనే మగ కోతి తల్లికోతి, పిల్లకోతిని గట్టిగా పట్టుకొని ఏ భయం లేదు అని చెబుతున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలు నెట్టింట చర్చకు దారితీశాయి.
ఊహించని పెద్ద శబ్దాలకు కోతులు, కుక్కలు వణికిపోతూ సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు తీస్తున్నాయి. భయంతో అవి ఆహారం తీసుకోకుండా రోజుల తరబడి ఇళ్ల మూలల్లో లేదా చెట్ల పొదల్లో దాక్కుంటున్నాయి. శబ్దాల ధాటికి దిక్కుతోచని స్థితిలో రోడ్లపైకి పరుగులు తీసి వాహనాల కింద పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. టపాసుల నుంచి వచ్చే దట్టమైన పొగ, రసాయనాల వల్ల పక్షులు, జంతువులు జబ్బు పడుతున్న సందర్బాలు ఉన్నాయి.
ALSO READ : దీపావళి వేళ క్విక్ కామర్స్ దూకుడు..మూడు రెట్లు పెరిగిన గిఫ్ట్ ఆర్డర్లు
జంతు ప్రేమికుల విజ్ఞప్తి..
పండుగ సంబరాల్లో పర్యావరణాన్ని, మూగజీవులను కాపాడటం మనందరి బాధ్యత అని స్వచ్ఛంద సంస్థలు గుర్తుచేస్తున్నాయి. శబ్ద కాలుష్యం లేని, తక్కువ పొగ వచ్చే బాణసంచాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాయి. జంతువులు, పక్షుల ఆవాసాలు ఎక్కువగా ఉండే చెట్లు, పార్కులు, వీధి కుక్కలు ఉండే ప్రాంతాలకు దూరంగా టపాసులు కాల్చాలని సూచిస్తున్నాయి. భయంతో మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చే మూగజీవాలను తరిమికొట్టకుండా, అవి కాసేపు దాక్కోవడానికి చోటు ఇవ్వాలని విజ్ణపత్తి చేస్తున్నారు. మన ఆనందం మరొక ప్రాణానికి సంకటంగా మారకూడదనే స్పృహతో పండుగలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు జంతు ప్రేమికులు.
This is why we say don't burst firecrackers. It causes air and sound pollution and is harmful to animals as well. https://t.co/DXMxIy8xIv
— Simpu Singh (@Simpu_SinghIND) November 9, 2026
