- హైదరాబాదీ నుంచి రూ.52,215 విలువైన ఆర్డర్
న్యూఢిల్లీ: దీపావళి పండగ వేళ క్విక్ కామర్స్ సంస్థలకు కొనుగోళ్ల రూపంలో భారీ ఆదరణ లభించింది. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌లో పార్టీ ఏర్పాట్లకు సంబంధించిన ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 162 శాతం పెరిగాయి. స్నాక్స్, చిరుతిళ్ల కొనుగోళ్లు 42 శాతం ఎగబాకాయి. స్వీట్లలో కాజు కత్లీకి అత్యధిక డిమాండ్ లభించగా, ఆ తర్వాత మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూలు నిలిచాయి. మరోవైపు జెప్టోలో పండగ గిఫ్ట్ హ్యాంపర్ల ఆర్డర్లు ఏకంగా 3 రెట్లు పెరిగాయి.
స్వీట్లలో లడ్డూలకు ఎక్కువ ఆర్డర్లు రాగా, మొత్తం అమ్ముడైన పరిమాణంలో సోన్‌పాపిడీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది దీపావళికి జెప్టోలో 4.68 లక్షల మట్టి దీపాల ఆర్డర్లు వచ్చాయి. పూలు, దండల కొనుగోళ్లు 2.5 రెట్లు పెరిగాయి. ఇన్‌స్టామార్ట్‌లో హైదరాబాద్ వినియోగదారుడు 2 గ్రాముల బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బిస్కెట్ కలిపి రూ.52,215 విలువైన ఆర్డర్ ఇచ్చాడు.
