దిమాగీ నక్సల్స్  ఎవరో తేలుద్దాం రండి..మోదీకి రాహుల్ సవాల్

దిమాగీ నక్సల్స్  ఎవరో తేలుద్దాం రండి..మోదీకి రాహుల్ సవాల్
  • ప్రధానమంత్రికి  రాహుల్ గాంధీ బహిరంగ సవాల్
  • సీఆర్పీఎఫ్ జవాన్లతో ‘మోదీ దీపావళి’ వీడియో అటాచ్
  • దేశద్రోహులెవరో, విదేశీ శక్తుల చేతిలో ఉన్నదెవరో తేల్చేద్దాం
  • చర్చ తర్వాత ఒక్క జవాన్ ముందు కూడా మోదీ నిలబడలేరని వ్యాఖ్య

 

న్యూఢిల్లీ: ‘దిమాగీ నక్సల్స్, దేశద్రోహులు ఎవరో, విదేశీ శక్తుల చేతుల్లో ఉన్నదెవరో తేల్చేద్దాం.. దమ్ముంటే బహిరంగంగా చర్చించకు రండి’ అంటూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి మరోమారు సవాల్ విసిరారు. దీపావళి వేడుకలను సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి జరుపుకున్న ప్రధాని మోదీ.. ఆ వేడుకల్లో చేసిన ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు.

మోదీ ఆరోపణలకు ఎక్స్ వేదికగా జవాబిస్తూ బహిరంగ చర్చకు రమ్మంటూ ఛాలెంజ్ విసిరారు. ‘ప్రధాని మోదీ చెప్పిన అబద్ధాలను మీరు నమ్మలేదని మీ ముఖాలే చెబుతున్నాయి. ఆయన మనల్ని అర్బన్ నక్సల్స్ అన్నారు. బహిరంగ చర్చకు రావాలని ఆయనకు నేను ఇప్పటికే సవాల్ విసిరాను. ఇప్పుడు మరోసారి చాలెంజ్ చేస్తున్నా. దేశద్రోహులు ఎవరో, విదేశీ శక్తుల చేతుల్లో ఉన్నది ఎవరో బహిరంగ చర్చలోనే తేల్చేద్దాం. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే డిబేట్ కు నేను రెడీ. ఈ డిబేట్ తర్వాత ఒక్క జవాన్ ముందు కూడా నిలబడే ధైర్యం ప్రధాని మోదీకి ఉండదని నేను గ్యారంటీ ఇస్తున్నా’ అంటూ రాహుల్ గాంధీ సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉద్దేశిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు సీఆర్పీఎఫ్ జవాన్లతో ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల వీడియోను రాహుల్ అటాచ్ చేశారు.

మరిన్ని వార్తలు