విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. అగ్నిప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు పోయాయ్

విషాదాన్ని మిగిల్చిన దీపావళి వేడుకలు.. అగ్నిప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు పోయాయ్

ముంబై/ధారాశివ్‌‌‌‌‌‌‌‌: మహారాష్ట్రలో దీపావళి వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ధారాశివ్ జిల్లాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. జిల్లాలోని యెడ్షి ప్రాంతంలోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో దుకాణం ఉండగా, మొదటి అంతస్తులో యజమాని కుటుంబం నివసిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదటి అంతస్తులోని నివాసంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్​లోని షాపుకు మంటలు విస్తరించాయి. మంటల కారణంగా భవనం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో మొదటి అంతస్తులోని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. దీపావళి సందర్భంగా ఇంటి ఆవరణలో వెలిగించిన ప్రమిద వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు