జవాన్ల చిరునవ్వే అసలైన దీపావళి వెలుగు: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

జవాన్ల చిరునవ్వే అసలైన దీపావళి వెలుగు: రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: జవాన్ల చిరునవ్వే అసలైన దీపావళి వెలుగు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం సిక్కింలోని నాథులా సమీపంలో ఉన్న షేరాథాంగ్ వార్ మెమోరియల్‌‌‌‌‌‌‌‌లో భారత సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. స్వయంగా జవాన్లకు స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.1967లో నాథులా, చోలా వద్ద చైనాతో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. 

అనంతరం జవాన్లను ఉద్దేశించి రాజ్​నాథ్ ​సింగ్ మాట్లాడుతూ.. సాయుధ దళాల త్యాగాలు, అంకితభావం వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా దీపావళి జరుపుకోగలుగుతున్నారని అన్నారు. ‘షేరాథాంగ్ వార్ మెమోరియల్‌‌‌‌‌‌‌‌లో అమరులైన వారికి నివాళులర్పించాను. దేశం ప్రశాంతంగా దీపావళి జరుపుకుంటోందంటే అది మన జవాన్ల త్యాగాల వల్లే. మన సైనికుల చిరునవ్వు, శక్తి, ధైర్యమే ఈ దీపావళికి అసలైన వెలుగు. షేరాథాంగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రతి జవాన్ ఒక దీపం లాంటివారు’ అని ఆయన చెప్పారు. 

దీపావళి వెలుగును సైనికులతో పోలుస్తూ ‘చీకటిని నిశ్శబ్దంగా తరిమేసే దీపం లాంటిదే సైనికుడి జీవితం. మీరు శబ్దం చేయకపోవచ్చు, కానీ మీ ఉనికి మొత్తం దేశంలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపుతుంది’ అని పేర్కొన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా జవాన్ల డిసిప్లిన్, ధైర్యం లేకుండా అది నిరుపయోగమని అన్నారు. యుద్ధ స్మారకాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే ప్రదేశాలని రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ తెలిపారు.

మరిన్ని వార్తలు