సౌతాఫ్రికా టూర్‌కు భారత మహిళల జట్లు ప్రకటన.. జెమీమా ఈజ్ బ్యాక్

సౌతాఫ్రికా టూర్‌కు భారత మహిళల జట్లు ప్రకటన.. జెమీమా ఈజ్ బ్యాక్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా టూర్‎కు భారత మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్, వన్డే, టీ20 మూడు సిరీస్‎లకు మూడు వేర్వేరు జట్లను సోమవారం (నవంబర్ 9) అనౌన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మందనా మూడు సిరీస్‎లకు సారథిగా జట్టును ముందుండి నడపనుంది. ఈ టూర్‎తో స్మృతి తొలిసారిగా భారత మహిళా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా బాధ్యతలు చేపట్టనుంది.

టీ20 సిరీస్‎కు యంగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ వైస్ కెప్టెన్‎గా ఎంపికైంది. సీనియర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ వన్డే, టెస్ట్ సిరీస్‎లకు స్మృతికి డిప్యూటీగా వ్యవహరించనుంది. గాయాలు, ఇతర కారణాలతో జట్టుకు దూరమైన సీనియర్ ప్లేయర్స్ జెమీమా రోడ్రిగ్స్, అమన్‏జోత్ కౌర్ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. 

జెమీమా టెస్ట్, వన్డే, టీ20 మూడు సిరీస్‎లకు ఎంపికైంది. ఇంగ్లాండ్ లోకల్ లీగ్ ది హండ్రెడ్‎లో ఆడుతుండగా జెమీమా గాయపడ్డ విషయం తెలిసిందే. ఇక, అమన్‌జోత్ కౌర్ టీ20 జట్టులో స్థానం సంపాదించుకుంది. ఆమె చివరిసారిగా ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడింది. జింబాబ్వేతో జరిగిన ఇటీవలి సిరీస్‌కు దూరమైన రేణుకా సింగ్ కూడా టీ20 జట్టులోకి తిరిగి వచ్చింది.

2026, డిసెంబర్‎లో టీమిండియా ఉమెన్స్ టీమ్ సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. టెస్టు మ్యాచ్ డిసెంబర్ 9న గెబెర్హాలో ప్రారంభం కానుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్ డిసెంబర్ 16న స్టార్ట్ అవుతుంది. 

మూడు వన్డేలు వరుసగా డిసెంబర్ 16, 19, 22 తేదీలలో పార్ల్, కేప్ టౌన్, బ్లూమ్‌ఫోంటైన్‌లలో జరుగుతాయి. ఆ తర్వాత టీ20ఐ సిరీస్ జరగనుంది. మూడు టీ20లు డిసెంబర్ 26, 29, 30 తేదీలలో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌కు బెనోని ఆతిథ్యం ఇవ్వగా, మిగిలిన రెండు మ్యాచ్‌లకు పోచెఫ్‌స్ట్రూమ్ వేదిక కానుంది.

టెస్ట్ స్క్వాడ్: 

స్మృతి మంధాన [సి], షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ [WK], యాస్తికా భాటియా [WK], దీప్తి శర్మ [VC], శ్రీ చరణి, స్నేహ రాణా, క్రాంతి శర్మాని, సతీ గౌడ్

ODI జట్టు: 

స్మృతి మంధాన [C], షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ [WK], యాస్తికా భాటియా [WK], దీప్తి శర్మ [VC], శ్రీ చరణి, వైష్ణవి కలిత శర్మ, J క్రాంతి గాడ్ శర్మ, నాన్తి గౌద్ శర్మ సత్ఘరే

T20I జట్టు: 

స్మృతి మంధాన [C], షఫాలీ వర్మ [VC], జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ [WK], G. కమలిని [WK], అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీ థరాణి, ప్రేమ రావత్, అమంజోత్ షర్మా గౌర్, క్ద్రంజోత్ షర్మా గౌర్, క్రీ. అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే