జన్నారం/ జన్నారం రూరల్,వెలుగు: కడెం ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్ రైతులు సోమవారం తపాల్పూర్ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుంచి సాగునీటి సరఫరాను ఇరిగేషన్ఆఫీసర్లు నిలిపివేయడంతో ఆగ్రహించిన రైతులు మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. తపాల్పూర్లో జరిగిన రాస్తారోకోలో జల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ నైనాల గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు.
ప్రాజెక్టులో సరిపడా నీరు ఉన్నా ఆఫీసర్లు నీటిని నిలిపివేయడంతో చివరి దశలో ఉన్న వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. కడెం ప్రాజెక్టు ఇరిగేషన్ఈఈ ప్రవీణ్‌కుమార్‌తో రైతులకు ఫోన్లో మాట్లాడించి నీటి విడుదలపై హామీ ఇప్పించారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో తపాలపూర్ మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కమ్మల విజయ్ ధర్మా, మామిడి సుశీలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాగా, రాస్తారోకో కారణంగా రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది.
