బాసర త్రిపుల్ ఐటీ హాస్టళ్ల కుళాయిల మురుగు నీరు సరఫరా.. స్కిన్ ఇన్ ఫెక్షన్ తో విద్యార్థుల కష్టాలు

బాసర త్రిపుల్ ఐటీ హాస్టళ్ల కుళాయిల  మురుగు నీరు సరఫరా.. స్కిన్ ఇన్ ఫెక్షన్ తో విద్యార్థుల కష్టాలు

నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మురుగునీరు దెబ్బ తగిలింది. పరిశుభ్రమైన వాతావరణం అధికారులు వేదికలపై చెప్పే మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు.  బాసర త్రిపుల్ ఐటీ  హాస్టల్ లో  మురుగునీటితో ఏరులై పారుతుంది. తున్నాయి. సమస్య కళ్లెదుటే కనిపిస్తున్నా  అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 కలుషితమైన మురుగునీరు బాసర త్రిపుల్   హస్టల్   విద్యార్థులకు మురికి నీటి సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నారు.   గంగా, యమున గర్ల్స్ హస్టల్ లో‌ ని  ట్యాప్ ల ద్వారా మురికి నీరు వస్తుంది.  ఈ నీటిని ఉపయోగించడం వలన విద్యార్థులు స్కిన్ ఇనఖ ఫెక్షన్ తో ( చర్మ వ్యాధులతో)  బాధ పడుతున్నారు. క్యాంపస్ లో ఉన్న  పీ1,పీ2, ఈ4విద్యార్థులు శుభ్రమైన నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.