మాదాపూర్ తమ్మిడికుంట.. ఈ నెల 11న సీఎం రేవంత్ ప్రారంభం.. ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

మాదాపూర్ తమ్మిడికుంట.. ఈ నెల 11న సీఎం రేవంత్  ప్రారంభం.. ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆక్రమణల కోరల్లో చిక్కుకుని కుంచించుకుపోయిన తమ్మిడికుంట చెరువు కొత్త రూపు సంతరించుకుంది. హైడ్రా  చేపట్టిన ప్రతిష్టాత్మక పునరుద్ధరణ పనులు పూర్తవడంతో, ఈ నెల 11న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ చెరువును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఐటీ కారిడార్ నడిబొడ్డున ఉన్న ఈ చెరువును కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.

తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.  వేదిక, వీఐపీలు, ప్రజల సీటింగ్ ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు.  వాహనాల పార్కింగ్ విషయంలో అధికారుల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.  ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.  ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ వెంట  సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, డీసీపీ రితిరాజ్ పర్యటించారు.  సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.