కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లోని వెంకేపెల్లి లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త మల్లారెడ్డి ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎలబోతారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సరిత-శ్రీనివాస్ ఇంట్లో దీపావళి వేడుకలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొ్న్నారు. టపాకాయలు ,కాకర ఒత్తులు మంత్రి పొన్నం కాల్చారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు.
