ఉసిరికాయతో పులిహార..కమ్మగా ఉంటుంది.. ఒక్కసారి తింటే అసలు వదిలి పెట్టరు..!

ఉసిరికాయతో పులిహార..కమ్మగా ఉంటుంది.. ఒక్కసారి తింటే అసలు వదిలి పెట్టరు..!

పులిహార అంటే చాలు జనాలు ప్లేట్లను ఖాళీగా ఉంచుకుంటారు. ఎప్పుడూ రెగ్యులర్​ గా  చేసే చింతపండు.. నిమ్మకాయ పులిహార అంటే బోర్​ కొడుతుంది కదా..! మరి కార్తీకమాసంలో స్పెషల్​ గావచ్చే ఉసిరికాయలతో పులిహార చేస్తే లొట్టలు వేస్తూ లాగిస్తారు.  మరి  ఉసిరి పులిహారను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.  ..!

 కార్తీక మాసం అనగానే వనభోజనాలు ఉసిరి చెట్టుకు పూజ చేయడం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చేస్తుంటాం. అలాంటి వాటిలో ఉసిరాకాయతో పులిహారను వడ్డించారంటే ప్రతి ఏడాది వనభోజనాలకు మీ దగ్గరకు రావాల్సిందే..!

ఉసిరికాయ పులిహోర తయారీకి కావాల్సినవి

  •  బియ్యం: మూడు కప్పులు
  •  పసుపు: రెండు స్పూన్లు
  •  ఉసిరికాయ తురుము: 10 ఉసిరికాయల 
  • ఉప్పు: తగినంత
  •  వేరుశెనగ నూనె: ఆరు టేబుల్​ స్పూన్లు  
  • ఆవాలు :  2 టీస్పూన్లు
  • జీలకర్ర :  2 టీస్పూన్లు
  • జీడిపప్పు : 10
  • పచ్చి శెనగపప్పు: 4 టేబుల్​ స్పూన్లు 
  • ఎండి మిరపకాయలు: 15
  • నల్ల మినపప్పు : ఒక టేబుల్​ స్పూన్​
  • అల్లం తరుగు : ఒకటిన్నర టేబుల్ స్పూన్ల
  • ఇంగువ: రెండు టేబుల్​ స్పూన్లు 
  • కొత్తిమీర : కొద్దిగా
  • కరివేపాకు: కొద్దిగా

ఉసిరికాయ పులిహోర తయారీ విధానం 

 బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టకుండా ప్రెషర్ కుక్కర్ లో నీళ్లు పోసి ..కొద్దిగా ఉప్పువేసి  ఉడికించుకోవాలి.  అయితే ఒకవిజిల్​ వచ్చే వరకు పెద్ద మంటపై మూడు విజిల్స్​ వచ్చే వరకు మీడియం మంటపై ఉంచాలి.  ఇప్పుడు స్టవ్​ ఆపేసి.. ఒక వెడల్పాటి బేసన్​ తీసుకొని దానికి నూనె రాసి అందులో అన్నాన్ని వేయాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో సరిపడ ఉప్పు...  పసుపు,  వేరుశెనగ నూనె వేసి అన్నాన్ని కలుపుకోవాలి.

►ALSO READ | ఆధ్యాత్మికం:కార్తీకదీపం.. దివ్యజ్యోతి దర్శనం..... ధ్వజస్థంభంపై ఆకాశదీప దర్శనం.. సంపద.. ఙ్ఞానం వృద్ది

అన్నం చల్లారేలోగా ఉసిరికాయలను తురుముకోవాలి.  ఇప్పుడు పోపు కోసం కళాయిను పొయ్యిపై పెట్టి నూనె వేడి చేయాలి.  నూనె వేడెక్కిన తరువాత నూనెలో నల్ల మినపప్పు , జీడిపప్పు, పచ్చిశనగపప్పు ఎర్రగా వేయించాలి. అందులోనే జీడిపప్పు కాస్త ఎర్రబడేంత వరకు వేయించాలి.  తరువాత  ఆవాలు,  జీలకర్ర,  సన్నని అల్లం తరుగు,  మిరపకాయలు వేసి వేయించాలి. . మిరపకాయలు  కాస్త రంగు మారగానే అందులో కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి కలపండి.

 ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమంలో  ఉసిరికాయ తురుము వేయాలి. -తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆ బాండీలోనే పసుపు కలుపుకుని పక్కన ఉంచుకున్న అన్నం వేయండి. కాస్త ఎక్కువగా కొత్తిమీర చల్లుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకుని తర్వాత స్టవ్ ఆపేయండి. -అంతే ఉపిరికాయ పలిహోర రెడీ. అయితే దీన్ని వెంటనే తినకుండా 1 గంట ఆగి తింటే ఫ్లేవర్స్ అన్నీ రైస్ కి పట్టి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది.