'ఫలక్‌నుమా దాస్'లో ‘రవి’గా విశ్వక్ సేన్‌తో ఢీ అంటే ఢీ అని సై అన్న నటుడు వివేక్ చేపూరి. తొలి చిత్రంలోనే తన మార్క్ విలనిజంతో టాలీవుడ్ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసిన ఈ హైదరాబాద్ యువకుడు చాలా కాలం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్ట్' చిత్రంలో ఇషాన్ అనే సైకోటిక్ విలన్ పాత్రలో వివేక్ చూపించిన నటన థియేటర్లలో వెన్నులో వణుకు పుట్టించింది.
ప్రస్తుతం నెట్టింట వివేక్ చేపూరి ఇషాన్ క్యారెక్టర్ ఎడిట్స్, మాస్ రీల్స్‌తో షేక్ అయిపోతోంది. వచ్చిన ప్రతీ ఆఫర్‌నూ గుడ్డిగా ఒప్పేసుకోకుండా, సరైన కంటెంట్ కోసం ఆచితూచి అడుగులేసిన వివేక్ విజన్‌కి ఈ రెస్పాన్స్ అద్దం పడుతోంది. అయితే, ఇకపై కేవలం విలనిజానికే పరిమితం కాకుండా, ఆయన బిగ్ స్క్రీన్‌పై రౌద్రం చూపించేందుకు హీరోగా ప్రమోషన్ పొందుతున్నారు..
►ALSO READ | Janhvi Kapoor : ముక్కు సర్జరీ చేయించుకున్నాకే హీరోయిన్‌గా ఓకే చెప్పింది.. శ్రీదేవిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!
టి. శరత్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఓ భారీ తెలుగు, తమిళం యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వివేక్ చేపూరి కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. తమిళ పరిశ్రమలోని అగ్ర సాంకేతిక నిపుణుడు ప్రియేష్ గురుస్వామి ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్నారు. వివేక్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా సాగే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్, టీజర్‌ను నవంబర్‌లోనే గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విలన్‌గా భయపెట్టిన వివేక్, ఇప్పుడు హీరోగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.
