మహేష్ బాబును మెప్పించిన సూర్య 'సీన్'.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్!

మహేష్ బాబును మెప్పించిన సూర్య 'సీన్'.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సీఫీస్ వద్ద వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.  దీపావళి కానుకగా నవంబర్ 6న రిలీజ్ అయిన 'సీన్'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. మళయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం తొలి వీకెండ్ తన కెరీర్ లో అత్యంత వసూళ్లు రాబట్టింది.  లేటెస్ట్ గాఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు.

ఈ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ' ది సీన్ ' మూవీ చూశాను. చాలా కూల్ గా, స్మార్ట్ గా , ఆద్యంతం ఎంతో సరదగా సాగింది. ఇన్ బరాజ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించారు. ఆయన నటన సూపర్ , నజ్రియా , నస్లెన్ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు జితు మాధవన్ రైటింగ్ , ఎగ్జిక్యూషన్ చాలా బాగున్నాయి. ప్రతి విభాగంలోనూ.. సినిమా ఆకట్టుకుంది. తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది అంటూ ప్రశంసలు కురిపించారు మహేష్ బాబు.

మరో వైపు 'సీన్' బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 145 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళనాడు, కేరళతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కేరళలో వస్తున్న కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వీకెండ్ లో వసూళ్లు క్రమంగా పుంజుకున్నాయి. అయితే బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి మరింత నిలకడైన వసూళ్లు అవసరం..

►ALSO READ | విశ్వక్ సేన్‌తో ఢీ.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'కల్ట్' విలన్!

ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇన్ బరాజ్ గా విభిన్నమైన పాత్రలో కనిపించారు. నజ్రియా నజీమ్ , నస్లెన్ కీలక పాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం , నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచియాయి. ముఖ్యంగా కామెడీ, యాక్షన్ , క్రైమ్ అంశాలను కలిపి జితు మాధవన్ రూపొందించిన ఈ క్రైమ్  కామెడీ చిత్రం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ సినిమాకు మహేష్ బాబు ప్రశంసలు మరింత బలాన్ని చేకూర్చింది. మరి ఈ సూపర్ స్టార్ రివ్యూ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుందా? రానున్న రోజుల్లో 'సీన్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..